Home » ఎన్టీఆర్ లేని టైం చూసి గుమ్మడి ఎందుకు అయన ఇంటికెళ్లారు ? అక్కడ ఏమి చేసారు *?

ఎన్టీఆర్ లేని టైం చూసి గుమ్మడి ఎందుకు అయన ఇంటికెళ్లారు ? అక్కడ ఏమి చేసారు *?

by AJAY
Published: Last Updated on

తెలుగు సినీ పరిశ్రమలో దిగ్గజ నటుల్లో ఒకరు అయినటువంటి గుమ్మడి గురించి ప్రత్యేకంగా తెలుగు సిరి ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఎన్నో సినిమాల్లో విలన్, అన్న, తమ్ముడు, నాన్న , స్నేహితుడు , ఇతర ఎన్నో ముఖ్యపాత్రలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు.

 

ఇలా ఎన్నో సినిమాలు ఎన్నో ముఖ్యపాత్రల్లో నటించిన ఈయన ఆయనకు సంబంధం లేని కొన్ని వివాదాల్లో ఇరుక్కుని కొంత పాలం పాటు నందమూరి తారక రామారావు గారితో కూడా మాటల్లేకుండా ఉండవలసి వచ్చింది. అలా ఎందుకు జరిగింది… ఎన్టీఆర్ కు తనకు మాటలేకుండా ఉండవలసిన పరిస్థితులు ఎందుకు ఎదురయ్యాయి. ఆ తర్వాత వారు ఎలా కలుసుకున్నారు అనేదాని గురించి తన ఆత్మకథ అయినటువంటి “తీపి గుర్తులు చేదు జ్ఞాపకాలు” అనే పుస్తకం లో రాసుకున్నాడు… వాటి వివరాలు ప్రకారం.

నేను తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆ కాలంలో స్టార్ హీరోలు అయినటువంటి ఎన్టీఆర్ గారితో ఏఎన్నార్ గారితో వరస సినిమాల్లో నటిస్తూ ఉండేవాడిని. ఎన్టీఆర్ తో సినిమాలను నిర్మించే నిర్మాణ సంస్థలు ఎక్కువ శాతం మద్రాసులో సినిమాలను నిర్మించేవి. ఏఎన్ఆర్ తో సినిమాలను నిర్మించే నిర్మాణ సంస్థలు హైదరాబాద్లో సినిమాలను నిర్మించేవి. ఎక్కువ శాతం నేను ఏఎన్నార్ గారి సినిమాల్లో నటిస్తూ ఉండడం వల్ల నెలలో 20 రోజులు హైదరాబాద్లో ఉండేవాడిని.

అలా పని చేస్తున్న సమయంలో ఒకరోజు హైదరాబాద్లో చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం ఆనాడు రెవెన్యూ శాఖ మంత్రి మర్రి చెన్నారెడ్డి … ఏఎన్ఆర్ ను కలవడానికి వచ్చాడు. అదే సమయంలో యాదృచ్ఛికంగా నేను కూడా అక్కడే ఉన్నాను. మరి చెన్నారెడ్డి… ఏఎన్ఆర్ గారి సంభాషణలో హైదరాబాద్లో ఫిలిం ఇండస్ట్రీ డెవలప్ చేయడానికి చాలా స్థలం అవసరం పడుతుంది. అందులో భాగంగా కొన్ని స్థలాలను చూద్దాం అని వారు ఇద్దరు బయలుదేరారు.

నేను కూడా అక్కడే ఉండడం వల్ల నన్ను కూడా రమ్మన్నారు. అనుకోకుండా నేను వెళ్ళాను. ఆ తర్వాత నేను మద్రాస్ కు వచ్చి ఎన్టీఆర్ గారి సినిమా షూటింగ్లో పాల్గొన్నాను. అందులో భాగంగా ఎన్టీఆర్ హైదరాబాద్లో విశేషాలేమిటి అని అడిగాడు. అందులో భాగంగా నేను ఏఎన్ఆర్ గారు హైదరాబాద్లో ఫిలిం ఇండస్ట్రీని డెవలప్ చేయడం కోసం భూములు చూస్తున్నారు అని చెప్పాను. దానితో ఆయన నా ప్రమేయం లేకుండా హైదరాబాద్లో ఫిలిం ఇండస్ట్రీని డెవలప్ చేస్తారా కోప్పడ్డారు… అలాగే తిట్టారు. ఆ తర్వాత మేమిద్దరం చాలా కాలం మాట్లాడుకోలేదు. అంతకు ముందు మేము మా కుటుంబాలు చాలా సాన్నిహితంగా ఉండేవి.

 

అలా చాలా సంవత్సరాలు మేము మాట్లాడుకోకపోవడంతో ఎన్టీఆర్ గారి తల్లి నా భార్యతో కోడలా కొడుకుని చూడక చాలా రోజులు అవుతుంది ఒకసారి నా కోసమైనా ఇంటికి రావచ్చు కదా అని అంది అంట… ఆ విషయాన్ని నా భార్య నాకు చెప్పగా … ఆమె కోసం అని ఎన్టీఆర్ లేని సమయంలో వారి ఇంటికి వెళ్ళి ఎన్టీఆర్ తల్లి గారితో కాసేపు మాట్లాడాను. నాకు అది చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఆ తర్వాత కొద్ది కాలానికి మేము కలుసుకున్నాము అని గుమ్మడి తన ఆత్మ కథ బుక్ లో రాసుకోచ్చాడు.

Visitors Are Also Reading