Home » ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో చరణ్ ఎన్టీఆర్ లకు అవమానం…!

ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో చరణ్ ఎన్టీఆర్ లకు అవమానం…!

by AJAY
Published: Last Updated on

కరోనా కారణంగా సంక్రాంతికి విడుదల కావాల్సిన ఆర్ఆర్ఆర్ సినిమాను మార్చి 25 కు వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. దాంతో చిత్ర యూనిట్ మరోసారి ప్రమోషన్స్ ను షురూ చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ హిందీ యూట్యూబర్ భువన్ బామ్ కు రాజమౌళి, రామ్ చరణ్ ,ఎన్టీఆర్ లు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ముగ్గురూ ఎంతో సన్నిహితంగా కనిపిస్తూ వినోదాన్ని పంచారు. ఇక ఈ ఇంటర్వ్యూ లో యాంకర్ ఎన్టీఆర్ తో మీరు నటించిన శక్తి సినిమా చూసా అని చెబుతూ హిందీ లో ఎన్టీఆర్ చెప్పిన ఓ డైలాగ్ చెప్పారు.

కాగా ఎన్టీఆర్ మాట్లాడుతూ ఆ సినిమా తప్ప వేరే సినిమా అదొరకలేదా అని అన్నారు. దాంతో భువన్ మరికొన్ని చిత్రాలు కూడా చేశా అని అన్నారు.

rrr movie ram charan

rrr movie ram charan

అంతే కాకుండా యాంకర్ రామ్ చరణ్ జంజీర్ ప్రస్తావన కూడా తీసుకువచ్చారు. జంజీర్ సినిమా కు తాను థియేటర్ కు వెళ్లగా అందరూ పడుకుని అన్నారని కామెంట్ చేశారు. దానికి చరణ్ నవ్వుతూ ఉండిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Also Read: బాలయ్య ను పక్కన పెట్టి పవన్ ను హీరోని చేస్తున్నారు…. టిడిపి పై శ్రీరెడ్డి ఫైర్…!

Visitors Are Also Reading