Home » ఒకే పేరుతో వచ్చిన ఎన్టీఆర్, బాలయ్య సినిమా ఏంటో తెలుసా..?

ఒకే పేరుతో వచ్చిన ఎన్టీఆర్, బాలయ్య సినిమా ఏంటో తెలుసా..?

by Azhar
Ad

మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో తండ్రి కొడుకులు కలిసి నటించిన సినిమాలు చాలా ఉన్నాయి. అలాగే ఈ మధ్య మన టాలీవుడ్ చాలా సినిమాలకు పాత సినిమాల పేర్లే పెడుతున్నారు. కానీ ఒక్కే టైటిల్ తో ఉన్న వేరు వేరు సినిమాల్లో తండ్రి కొడుకుల నటించడం చాలా తక్కువగా జరుగుతుంది. తెలుగు సినిమాను ఎంతో ఎత్తుకు తీసుకెళ్లిన ఎన్టీఆర్ అలాగే ఆయన కుమారుడు బాలకృష్ణ ఒక్కే టైటిల్ తో ఉన్న సినిమాలో నటించారు. ఆ సినిమా పేరే రాముడు భీముడు.

Advertisement

Advertisement

ఎన్టీఆర్ నటించిన రాముడు భీముడు సినిమా 1964లో విడుదల అయ్యింది. ఈ సినిమాకు తాపీచాణక్య దర్శకత్వం వహించగా.. రామానాయుడు గారు సురేష్ ప్రొడక్షన్ లో ఈ సినిమాను నిర్మించారు. ఎన్టీఆర్ మొదటిసారిగా ఈ సినిమాలో డబల్ యాక్షన్ చేసారు. జామున, విజయలక్ష్మి ఎన్టీఆర్ జోడిగా కనిపించిన ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో దీనిని అప్పుడే హిందీలో కూడా రీమేక్ చేసారు.

ఇక ఇదే పేరుతో బాలకృష్ణ నటించిన చిత్రం 24 ఏళ్ళ తర్వాత అంటే 1988 లో విడుదల అయ్యింది. మురళి మోహన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కూడా బాలయ్య రెండు పాత్రలు పోషించారు. అయితే గతంలో తండ్రి డబల్ యాక్షన్ చేసిన రాముడు భీముడు విజయం సాధించడంతో.. బాలయ్య డబల్ యాక్షన్ సినిమాకు కూడా సెంటిమెంట్ గా అదే పేరు పెట్టారు. అయితే ఈ సెంటిమెంట్ పనిచేసి.. బాలయ్య రాముడు భీముడు కూడా అద్భుత విజయాన్ని అందుకుంది.

Visitors Are Also Reading