వైజయంతీ మూవీస్ అధినేత చలసాని అశ్వనీదత్ NTR తో ఎదురులేని మనిషి సినిమా తీస్తున్న రోజులు.. ఓ రోజు సినిమా షూటింగ్ జరుగుతుంది. ఓ షాట్ నిమిత్తం NTR రెడీ అయ్యి కూర్చొని ఉన్నారు. అదే సమయానికి అక్కడికి ఆ సినిమా నిర్మాత అశ్వనీదత్ వచ్చారు.
అప్పుడు దత్ గారి వయసు 24 సంవత్సరాలు , NTR వయసు 52 ఏళ్ళు…దత్ ను చూసి NTR లేచి నిల్చున్నారు. NTR నిల్చోవడాన్ని చూసిన దత్ గారు…అన్నగారు మీరు నిల్చోడం ఏంటి? అని అడగగా…. నిర్మాత అంటే యజమాని ఇక్కడున్న వారికి అన్నంపెట్టే వాడు. అలాంటి నిన్ను నేనే గౌరవించకపోతే ఇతరుల ఎలా గౌరవిస్తారని అన్నారట!
Advertisement
Also Read: బాలయ్య చేయాల్సిన సింహాద్రి NTRకు ఎలా వచ్చింది?
Advertisement
ఒక సీత కథ అనే సినిమాతో 21 ఏళ్ళ అశ్వనీదత్ నిర్మాతగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. NTR తో సినిమా తియ్యాలనేది ఆయన కల. అయనను కలవడం కోసం ప్రతి రోజూ ఉదయం 4 గంటలకు NTR ఇంటి ముందు వెయిట్ చేసేవారట! ఇలా 4 నెలలు వెయిట్ చేశారట! అలా ఓసారి NTR ను కలిసి తనతో సినిమా చేయాలనే మనసులోని మాట చెప్పారు. అప్పుడే NTR అశ్వనీదత్ బ్యానర్ పేరును వైజయంతీ మూవీస్ అని పెట్టారు. వైజయంతీ అంటే కృష్ణుడి మెడలో ఉన్న దండ…ఎప్పటికీ వాడిపోకపోవడం దాని ప్రత్యేకత.
Also Read: NTR డైరెక్షన్ లో బాలకృష్ణ నటించిన సినిమాలు., వాటి విశేషాలు!