Home » మామ‌య్యా మీరు త్వ‌ర‌గా కోలుకోవాలి : ఎన్టీఆర్

మామ‌య్యా మీరు త్వ‌ర‌గా కోలుకోవాలి : ఎన్టీఆర్

by AJAY
Ad

క‌రోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతున్న సంగ‌తి తెలిసిందే. సాధార‌ణ ప్ర‌జ‌ల‌తో పాటూ సెలబ్రెటీలు, రాజ‌కీయ నాయ‌కులు సైతం క‌రోనా బారిన‌ప‌డుతున్నారు. ఇక రీసెంట్ గా టీడీపీ అధినేత చంద్ర‌బాబు మ‌రియు ఆయ‌న కుమారుడు టీడీపీ యువ‌నేత నారా లోకేష్ కూడా క‌రోనా బారిన‌ప‌డ్డారు. మొద‌ట నారాలోకేష్ కు క‌రోనా పాజిటివ్ రాగా ఆ త‌ర‌వాత త‌న‌కు కూడా క‌రోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయ్యింద‌ని చంద్ర‌బాబు తెలిపారు.

Advertisement

Advertisement

ఇక పాజిటివ్ రావ‌డంతో ప్ర‌స్తుతం ఇద్ద‌రూ హోం ఐసోలేష‌న్ లో చికిత్స తీసుకుంటున్నారు. అయితే చంద్ర‌బాబు లోకేష్ త్వ‌ర‌గా కోలుకోవాలి అంటూ ప‌లువురు ప్ర‌ముఖులు కోరుకుంటున్నారు. ఇప్ప‌టికే మెగాస్టార్ చిరంజీవి మ‌రియు ప‌లువురు హీరోలు చంద్ర‌బాబు త్వ‌ర‌గా కోలుకోవాలంటూ ట్వీట్ లు చేశారు. కాగా తాజాగా ఎన్టీఆర్ మామ‌య్యా మీరు త్వ‌ర‌గా కోలుకోవాలి అంటూ చంద్ర‌బాబును ఉద్దేశించి ట్వీట్ చేశారు. లోకేష్ కూడా ఆరోగ్య‌వంతుడు కావాలంటూ ఎన్టీఆర్ కోరుకున్నారు.

Visitors Are Also Reading