Home » NTR 30 : లీక్ అయిన స్టోరీ.. కోపంతో ఊగిపోతున్న ఎన్టీఆర్

NTR 30 : లీక్ అయిన స్టోరీ.. కోపంతో ఊగిపోతున్న ఎన్టీఆర్

by Anji
Ad

ఆర్ఆర్ఆర్ వంటి భారీ హిట్ సినిమా త‌రువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను ఎప్పుడో ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ సెట్స్ మీదకు మాత్రం వెళ్ల‌డం లేదు. ఓవైపు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుంద‌నే విష‌యంపై మేకర్స్ మాత్రం ఇంకా ఓ క్లారిటీ ఇవ్వలేదు. ఆర్ఆర్ఆర్ తర్వాత పాన్ ఇండియా రేంజ్‌లో సినిమా చేయాలనే ఆలోచన ఉండడం వల్లే ‘ఎన్టీఆర్ ౩౦’ పై చాలా కేర్ తో ముందుకు సాగుతున్నారు. కొరటాల శివ ఆల్రెడీ తయారుచేస్తున్న స్క్రిప్ట్ ను రైట్ చేస్తున్నట్లు సమాచారం. అందుకే ఈ సినిమా ఆల‌స్యం అవుతుందని స‌మాచారం.

Advertisement

ఇక ఈసారి గరుడ పురాణంలోని ఓ అంశాన్ని తీసుకొని కథను సిద్ధం చేశారట. అయితే గరుడ పురాణంలో 18 వేల శ్లోకాలు ఉన్నాయి.ఇందులో ముఖ్యమైన పాయింట్ ఆధారంగా సినిమా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకం. అందుకే ఈసారి సరికొత్త డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన అపరిచితుడు సినిమాలో విక్రమ్ హీరో మనుషులు చేసే తప్పులను గరుడ పురాణం శిక్షలను విధిస్తుంటాడు. ఇప్పుడు కొరటాల కూడా అదే స్టైల్ ను ఫాలో కానున్నాడని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ వార్త‌ల్లో వాస్త‌వం తెలియాలంటే వెయిట్ చేయ‌క‌ తప్పదు. కొరటాల స్టోరీని రివీల్ చేసినందుకు ఎన్టీఆర్ అభిమానులు ఆయన పై గుర్రుగా ఉన్నారట. ఇక ఇండియాలోనే కాకుండా వెస్ట్రన్ కంట్రీ లోను ఎన్టీఆర్ కు విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ సినిమాను జపాన్ తదితర 9 భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

Advertisement

Also Read :  1999 బాలకృష్ణ, చిరంజీవి సునామి లో కొట్టుకుపోయిన టాలీవుడ్ సినిమాలు ఇవే!

ఇదివరకు ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో వచ్చిన జనతాగ్యారేజ్ బంపర్ హిట్‌ కొట్టింది. ఇప్పుడు ఈ సినిమా కూడా తప్పక విజయం సాధిస్తుందని భావిస్తున్నారు. ఈ చిత్రంపై పాన్ ఇండియా లెవెల్లో భారీ స్థాయి హైప్ సెట్ అయింది. ఎన్టీఆర్ 30 కి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ ని అభిమానుల డిమాండ్ తో తీసుకొచ్చారు. దీంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొనగా రీసెంట్ గా అనిరుద్ పుట్టినరోజు కావడంతో సినిమా నిర్మాతలు అతడికి శుభాకాంక్షలు తెలియజేసి ఎన్టీఆర్ 30 ఆల్బమ్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు.

Also Read :  శ్రీదేవి త‌న‌కు గురువు అని చెప్పుకున్న ఎన్టీఆర్..! ఆయ‌న ఎందుకు అలా అనేవారో తెలుసా..?

Visitors Are Also Reading