Telugu News » Blog » పుష్ప‌ ది రూల్ లో పుష్ప‌రాజ్ ట్విస్ట్ అదిరింది..!

పుష్ప‌ ది రూల్ లో పుష్ప‌రాజ్ ట్విస్ట్ అదిరింది..!

by Anji
Ads

ఐకాన్ స్టార్ హీరో అల్లుఅర్జున్ న‌టించిన పుష్ప సినిమా ఏ రేంజ్‌లో హిట్ అయిందో అంద‌రికీ తెలిసిందే. ఈ సినిమాను టాలెంటెడ్ ద‌ర్శ‌కుడు సుకుమార్ డైరెక్ట్ చేశాడు. ఈయ‌న ద‌ర్శ‌క‌త్వం, బ‌న్నీ యాక్టింగ్, మ్యూజిక్ ఇలా అన్నీ ఈ సినిమాను టాప్‌లో నిల‌బెట్టాయి అన‌డంలో ఎలాంటి సందేహం లేద‌నే చెప్ప‌వ‌చ్చు. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.

Ads

పుష్ప ది రూల్ లో పుష్పరాజ్ కు వెన్నుపోటు.. ట్విస్ట్ అదిరింది..

ఇది పాన్ ఇండియా సినిమా కావ‌డంతో ఈ చిత్రం బాలీవుడ్ సినిమాల‌ను సైతం వెన‌క్కి నెట్టింద‌నే చెప్పాలి. ఈ చిత్రం హిందీ మార్కెట్‌లో అందుకున్న విజ‌యం బ‌న్నీ కెరీర్‌ను టాప్‌లో నిల‌బెట్టింది. ఎవ్వరూ ఊహించ‌ని విధంగా ఈ సినిమా హిందీ మార్కెట్‌లో హ‌వా చూపించింది. ఇక ఈ సినిమా రెండు పార్టులుగా విడుద‌ల‌వుతున్న విష‌యం తెలిసిన‌దే.

Ad

Allu Arjun's Pushpa Movie: 5 things you need to know about Allu Arjun starrer 'Pushpa'

Ads

ఇప్ప‌టికే పుష్ప‌ది రైజ్ పేరుతో మొద‌టి పార్ట్‌ను విడుద‌ల చేయ‌గా.. ఇక ఇప్పుడు పుష్ప ది రూల్ పేరుతో రెండ‌వ పార్ట్‌ను సిద్దం చేస్తున్నాడు సుకుమార్. ఫిబ్ర‌వ‌రిలో పుష్ప‌2 సెట్స్ మీద‌కు కూడా వెళ్ల‌నుంది. ఇప్ప‌టికే సుకుమార్ అందుకు కావాల్సిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ త‌రుణంలో తాజాగా పుష్ప ది రూల్ నుంచి ఒక వార్త బ‌య‌ట‌కి వ‌చ్చింది. ఇది ఇప్పుడు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.

Pushpa: फिल्म के किरदार जैसी ही थी केशव की पर्सनल लाइफ, कभी थ‍िएटर्स में बेचते थे फ्रेंच फ्राइज-pushpa the rise keshava aka jagadeesh pratap bhandai biography in hindi actor supplied ...
అయితే పుష్ప ది రూల్ లో ఒక అదిరిపోయే ట్విస్ట్ ఉండ‌నున్న‌ద‌ని స‌మాచారం. ఈ సినిమా పార్ట్ -1 లో పుష్ప ప‌క్క‌న ఉండే కేశ‌వాకు ఎక్కువ ప్రాధాన్య‌త ఇచ్చిన విష‌యం తెలిసిందే. అయితే పార్ట్-2లో పుష్ప‌రాజ్ కి కేశ‌వా వెన్నుపోటు పొడ‌వ‌నున్నాడు అని దీంతో పుష్ప కొత్త చిక్కులు ఎదుర్కోబోతున్నాడ‌ని టాక్ వినిపిస్తోంది. అదేవిధంగా పార్ట్‌-1 విల‌న్‌లుగా క‌నిపించిన జాల్‌రెడ్డి, మంగ‌ళం శ్రీ‌ను, దాక్షాయ‌ణి పుష్ప‌పై ప్ర‌తీకారం తీర్చుకోబోతున్నార‌ని.. షికావ‌త్ కూడా పుష్ప‌పై ప‌గ తీర్చుకుంటాడ‌ని మీడియాలో వార్త‌లు జోరుగా ప్ర‌చారం కొన‌సాగుతున్నాయి. ఇందులో నెజ‌మెంతో తెలియ‌దు కానీ ఈ వార్త‌లు మాత్రం నెట్టింట వైర‌ల‌వుతున్నాయి.