Home » చైనాలో 100 రోజులు ఆడి రికార్డులు క్రియేట్ చేసిన ఎన్టీఆర్ సినిమా ఏదో తెలుసా..?

చైనాలో 100 రోజులు ఆడి రికార్డులు క్రియేట్ చేసిన ఎన్టీఆర్ సినిమా ఏదో తెలుసా..?

by AJAY
Ad

న‌ట‌సార్వ‌భౌముడు ఎన్టీఆర్ ఏ విష‌యంలో అయినా చాలా జాగ్ర‌త్తగా వ్య‌వ‌హ‌రించేవారు. క్ర‌మ‌శిక్ష‌ణ‌కు ఆయ‌న మారుపేర‌ని చెబుతుంటారు. ఉద‌యాన్నే లేవ‌డం వ్యాయామం చేయ‌డం పూజ చేయ‌డం అంతే కాకుండా టైమ్ కు షూటింగ్ కు వెళ్ల‌డం ఇలా ప్ర‌తి ఒక్క విష‌యంలో ఎన్టీఆర్ క్ర‌మ‌శిక్ష‌ణ‌గా ఉండేవారు. ఎన్టీఆర్ స‌క్సెస్ కు సూత్రం కూడా ఆయ‌న క్ర‌మ‌శిక్ష‌ణే అని స‌న్నిహితులు చెబుతుంటారు.

Advertisement

ఇక ఎన్టీఆర్ కెరీర్ లో ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాలు ఉన్నాయి. పౌరాణిక పాత్ర‌లు అంటే ఇప్ప‌టికీ టాలీవుడ్ లో గుర్తుకు వ‌చ్చేపేరు అన్న‌గారిదే. అంతే కాకుండా కృష్ణుడు, రాముడు పాత్ర‌లు చేయాల‌న్నా కూడా అన్న‌గారి త‌ర‌వాతే ఎవ‌రైనా. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ మొదట చేయ‌నంటే చేయ‌న‌ని చెప్పి చివ‌రికి అదే సినిమాలో న‌టించి రికార్డులు సృష్టించారు. ఆ సినిమా ఏంటో ఇప్పుడు చూద్దాం….దర్శకుడు బీఎన్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ హీరోగా వ‌చ్చిన సినిమా మ‌ళ్లీశ్వ‌రి.

Advertisement

ఈ సినిమాలో భానుమ‌తి హీరోయిన్ గా న‌టించింది. మొద‌ట ఎన్టీఆర్ ఈ సినిమాలో న‌టించ‌డానికి ఇష్ట‌ప‌డలేదు. క‌థ న‌చ్చ‌క‌నో మ‌రే ఇత‌ర కార‌ణమో గానీ చేయ‌ను అంటే చేయ‌న‌ని మొండి చేశారు. ఈ సినిమా నిర్మాత‌లు సైతం ఎన్టీఆర్ ను బ‌తిమిలారు. కానీ ఆయ‌న మాత్రం నో చెప్పారు. దాంతో అక్కినేని నాగేశ్వ‌ర‌రావును హీరోగా పెట్టి చేయాల‌నుకున్నారు.

కానీ ద‌ర్శ‌కుడు వీఎన్ రెడ్డి మ‌రోసారి ఎన్టీఆర్ వ‌ద్ద‌కు వెళ్లి ఈ సినిమా బ‌హు భాష‌ల్లో రిలీజ్ అవుతుంద‌ని మీకు మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంద‌ని చెప్పి ఒప్పించారు. అలా ఎన్టీఆర్ చివ‌రికి ఒప్పుకున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆఆర్ చేసిన నాగ‌రాజు పాత్ర మాస్ ఇమేజ్ ను మ‌రింత పెంచింది. అంతే కాకుండా రాజ‌రిక‌పు ఆడంబ‌రాలు, ఆచారాలు ఉన్నా కూడా ఈ సినిమా చైనాలో వంద రోజులు ఆడి రికార్డులు క్రియేట్ చేసింది.

ALSO READ : శోభ‌న్ బాబు ప‌వ‌న్ క‌ల్యాణ్ ల కాంబోలో మిస్ అయ్యిన సినిమా ఏదో తెలుసా…? ఎందుకు మిస్ అయ్యిందంటే..?

Visitors Are Also Reading