విశ్వవిఖ్యాతనటసార్వభౌముడు నందమూరి తారకరామారావు హవా అప్పట్లో ఎలా ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోగా ఎదిగారు. ఎన్టీఆర్ సినిమా వచ్చిందంటే ప్రేక్షకులు థియేటర్ ల వద్ద క్యూ కట్టేవారు. సినిమా ఎలా ఉన్నా ఆయన కటౌట్ చూస్తే చాలని అనుకునేవాళ్లు. ఇక ఎన్టీఆర్ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ సినిమాలలో జస్టిస్ చౌదరి సినిమా కూడా ఒకటి. 1982 మే 8న ఈ సినిమా విడుదలైంది.
Advertisement
ఈ సినిమాలో ఎన్టీఆర్ జస్టిస్ చౌదరి పాత్రలో అదరగొట్టారు. సినిమాలో ఉండే ఫ్యామిలీ ఎమోషన్స్ కు ప్రేక్షకులు ఎంతగానో కనెక్ట్ అయ్యారు. ఈ సినిమాలో హౌకోర్ట్ లాయర్ గా ఎన్టీఆర్ నటించారు. ఈ సినిమాలోని పాటలు అందులో ఎన్టీఆర్ వేసిన స్టెప్పులు ప్రేక్షకులతో డ్యాన్స్ లు చేయించాయి. ఇక ఈ సినిమాను కే త్రివిక్రమరావు నిర్మించగా కే రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు.
Advertisement
వేటూరి రాసిన పాటలు సత్యానంద్ పాటలు సినిమాకు మరో హైలెట్ గా నిలిచింది. ఈ సినిమా ఓ థియేటర్ లో ఏకంగా వందరోజులు ఆడి రికార్డులు క్రియేట్ చేసింది. అంతే కాకుండా చాలా థియేటర్లలో ఈ సినిమా వందరోజులకు పైగా ఆడి కలెక్షన్లను రాబట్టింది. ఇక ఈ సినిమా విజయోత్సవ సభను తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినిమాలో ముఖ్యమైన పాత్రలలో నటించిన ఎన్టీఆర్, శారద, ఊర్వశిలు చీఫ్ గెస్ట్ లుగా హాజరయ్యారు.
కాగా ఈ సభకు వచ్చినవారిలో కొంతమంది సినీక్రిటిక్స్ ఎన్టీఆర్ కంటే శారద, ఊర్వశిలు అద్భుతంగా నటించారు అంటూ కామెంట్లు చేశారు. దాంతో ఎన్టీఆర్ హర్ట్ అయ్యారు. సినిమాను పైపై మాత్రమే చూశారు కానీ అందులోని అంతరార్థాన్ని అర్థం చేసుకోలేని అన్నారు. అంతే కాకుండా న్యాయవ్యవస్థపై ఈ సినిమా ప్రభావం చూపిస్తుందని ఎన్టీఆర్ భావించారు కానీ అలా కూడా జరగలేదు. దాంతో అన్నగారు చాలా బాధపడ్డారట.