తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర విజయవంతంగా ముగిసింది. రాహుల్ మహారాష్ట్రలోకి ప్రవేశించారు. అక్టోబర్ 23న మక్తల్ వద్ద తెలంగాణలోకి ప్రవేశించిన ఉం యాత్ర.. 16 రోజుల్లో 4 రోజుల విరామంతో 12 రోజులపాటు 375 కి.మీ రాహుల్ యాత్ర సాగింది. 60 రోజులుగా రాహుల్ కొనసాగుతోంది.
Advertisement
తిరుమలలో నేడు శ్రీవారి ఆలయం మూసివేశారు. చంద్రగ్రహణం కారణంగా 11 గంటల పాటు శ్రీవారి ఆలయ తలుపులు మూసేశారు. బ్రేక్ దర్శనాలు రద్దు చేయడం తో పాటు ఇవాళ ఉదయం 8.30 నుండి రాత్రి దాదాపు 7.30 గంటల వరకు శ్రీవారి ఆలయం మూసివేయానున్నారు.
ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా 53 మంది డీఎస్పీల బదిలీలు జరిగాయి. ఈ మేరకు డిజిపి రాజేంద్రనాథ్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
Advertisement
ఈ నెల 16 నుంచి శబరిమల అయ్యప్పస్వామి దర్శనం జరగనుంది. వచ్చే ఏడాది జనవరి 15వ తేదీ వరకు అయ్యప్పస్వామి దర్శనం కు అనుమతులు ఇచ్చారు.
మధ్యప్రదేశ్ ఎంపీ జనార్ధన్ మిశ్రా ఓ కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గుట్కా తినండి.. మద్యం తాగండి కానీ నీటిని కాపాడండి అంటూ కామెంట్ చేశారు. నీటి సంరక్షణకు సంబంధించిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
టీమిండియా మేనేజ్మెంట్ ఊపిరి పీల్చుకుంది. రీసెంట్ గా గాయపడిన కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి ప్రాక్టీస్ మొదలుపెట్టారు.
ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ఫైర్ అయ్యారు. ట్విట్టర్ లో డిస్ప్లే లో ఖాతా పేరుకు బదులుగా మరొక పేరును వాడితే శాశ్వతంగా ట్విట్టర్ నుండి తొలగిస్తామని హెచ్చరించారు.
ఈనెల 15వ తేదీ నుండి జనవరి 16వ తేదీ వరకు శబరిమల ఆలయ దర్శనం ఉంటుందని కమిటీ ప్రకటించింది. అంతేకాకుండా ఆలయ పోర్టల్ లో పేర్లు నమోదు చేసుకున్న వారికి మాత్రమే దర్శనం ఉంటుంది అని స్పష్టం చేసింది.