11,12 తేదీల్లో చంద్రబాబు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. 11న ఎమ్మిగనూరు, 12న పత్తికొండ, కర్నూలు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. 12న ఆధునీకరించిన టీడీపీ ఆఫీస్ ను చంద్రబాబు ప్రారంభించనున్న ప్రారంభించనున్నారు.
Advertisement
హైకోర్ట్ కు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడు నందు భార్య వెళ్లారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని నందు భార్య పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ హైకోర్ట్ లో విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగిపోయింది. నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 70,263 మంది…స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 28,965 మంది…నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ.4.53కోట్లు కాగా శ్రీవారి సర్వదర్శనానికి 20గంటల సమయం పడుతోంది.
తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, నాగపట్నం, కడలూరు,కరైకల్ సహా ఎనిమిది జిల్లాలలో పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. ఏడు జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించారు.
Advertisement
నల్లగొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. పోలింగ్ 93.13 శాతం నమోదయ్యింది. మొత్తం 2,41,805 ఓట్లు ఉండగా 2,25,192 ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ ఓట్లు 686 గా ఉన్నాయి.
తూర్పుగోదావరిలో సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో గోకవరంలో ఉదయం 8 నుండి మధ్యాహ్నం 2 గం.వరకు ట్రాఫిక్ మళ్ళింపు చేపడుతున్నారు. రంపచోడవరం వైపు నుంచి రాజమండ్రి వెళ్లే బస్సులు, లారీలు..కొత్తపల్లి,జగ్గంపేట మీదుగా మళ్లిస్తున్నారు. గోకవరం వైపు వెళ్లే బస్సులు, లారీలు బూరుగుపూడి గేటు నుండి మళ్లిస్తున్నారు.
నేడు హైకోర్టులో అయ్యన్నపాత్రుడు లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ జరగనుంది. తనపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టెయ్యాలంటూ నిన్న హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కేసు డైరీని తమ ముందు ఉంచాలని సీఐడీకి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
కార్తీక శుద్ధ ఏకాదశి సందర్భంగా అన్నవరం సత్యదేవుని ఆలయంలో భక్తుల రద్దీ పెరిగిపోయింది. స్వామివారి దర్శనం, వ్రతాల కోసం సందడిగా ఆలయ ప్రాంగణం కనిపిస్తోంది. ఏకకాలం లో 2 వేల వ్రతాలు జరిగేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ ఒక్క రోజే లక్ష మంది దర్శనం చేసుకుంటారని అంచనా వేస్తున్నారు.