Home » Nov 3rd 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Nov 3rd 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

విశాఖల‌లోని క్వీన్ మేరీ హైస్కూల్ లో నలుగురు పదవ తరగతి విద్యార్థినిలు అదృశ్యం క‌ల‌క‌లం రేపుతోంది. విద్యార్థినుల అదృశ్యం పై త‌ల్లి దండ్ర‌లు వ‌న్ టౌన్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నిన్న సాయంత్రం నుండి విద్యార్థినిలు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్య‌క్తం చేస్తున్నారు. మిస్సింగ్ కేసు మిస్టరీని ఛేదించే పనిలో పోలీసులు నిమ‌గ్న‌మ‌య్యారు.

ఏలూరు జిల్లా ఏలూరు సమీపంలో జాతీయ రహదారిపై పెను ప్రమాదం త‌ప్పింది. దేవరపల్లి నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ట్యాంకర్ నుంచి హైడ్రోక్లోరిక్ యాసిడ్ లీక్ అయ్యింది. వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది నీటితో ట్యాంకర్ ను చల్లబరిచే ప్రయత్నం చేశారు. ముందు జాగ్రత్తగా ట్రాఫిక్ ను మళ్ళించారు.

Advertisement


సంగారెడ్డిలో రాహుల్ పాదయాత్రలో రిటైర్డ్ నావి చీఫ్ అడ్మిరల్ రామదాసు పాల్గొన్నారు. రామ‌దాసు 89 సంవత్సరాల వయసులో సతీ సమేతంగా రాహుల్ తో పాటు అడుగులు వేశారు.

విశాఖ‌లో సీఐడీ రీజనల్ కోర్టు వద్ద ఉద్రిక్తత వాతావ‌రణం చోటు చేసుకుంది. సీఐడీ కార్యాలయానికి వచ్చిన టీడీపీ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబును పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులకు-ఎమ్మెల్యేకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది.

Advertisement

మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడిని పోలీసులు సీఐడీ ఆఫీసుకు తరలించారు. సీఐడీ కార్యాలయానికి గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సైతం చేరుకున్నారు.

ఢిల్లీలో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం ఏర్పాటు చేయ‌నుంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

పవన్‌ కల్యాణ్‌ను ఈ మధ్య అనుమానాస్పద వ్యక్తులు అనుసరిస్తున్నారని జ‌న‌సేన నాయ‌కులు నాదెండ్ల మ‌నోహ‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. విశాఖ ఘటన తర్వాత పవన్‌ ఇల్లు, పార్టీ ఆఫీస్‌ దగ్గర అనుమానాస్పందంగా కొంత‌మంది తచ్చాడుతున్నారని అన్నారు. పవన్ ఇంటి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు, తిరిగి వస్తున్నప్పుడు వాహనాన్ని అనుసరిస్తున్నార‌ని చెప్పారు.

గ్రూప్ వన్‌ అప్లికేషన్ దాఖలు గడువును ఏపీపీఎస్సీ మ‌రోమూడు రోజులు పొడిగించింది. ఈ నెల 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంద‌ని స్ప‌ష్టం చేసింది

#AndhraPradesh #APPSC

Visitors Are Also Reading