Home » Nov 2nd 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Nov 2nd 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY

తెలంగాణలో భార‌త్ జూడో యాత్రం 8వ రోజుకు చేరింది. నేడు బాలానగర్ నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభం కానుంది. హబీబ్ నగర్, ముసాపేట్, ఐడీఎల్ జంక్షన్, కూకట్ పల్లి, హఫీజ్ పేట్ మీదుగా రాహుల్ పాదయాత్ర సాగ‌నుంది.

ఏపీలో ముందుస్తు ఎన్నికలు రావని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్ల‌డించారు. గ‌త కొంత‌కాలంగా ముంద‌స్తు ఎన్నిక‌ల పై వ‌స్తున్న వార్త‌ల నేప‌థ్యంలో ఆయ‌న క్లారిటీ ఇచ్చారు.

హైదరాబాద్ ప్రజలు చూపిన ప్రేమ, ఉత్సాహం ఎప్పటికీ మరవలేను అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. దేశంలోనే హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నలజీ సిటీగా పేరు గాంచిందన్నారు. సంస్కృతి, సంప్రదాయం అనేవి తెలంగాణ డీఎన్ఏలోనే ఉన్నాయని రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు.

మునుగోడులో పంపకాలు మొదలయ్యాయి. పార్టీలు ప్రలోభాలకు తెర తీశాయి. ఓ పార్టీ ఓటుకు మూడు వేలు ఇచ్చిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. అంతే కాకుండా రెండో విడత పంపకం ఉంటుందని హామీ ఇచ్చిన‌ట్టు స‌మాచారం.

ఇండియాలో ప్ర‌తిముగ్గురిలో ఒక‌రు మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబం అని ప్రెస్ నివేధిక వెల్ల‌డించింది. వ‌చ్చే మూడేళ్ల‌లో మధ్య త‌ర‌గ‌తి జ‌నాభా పెరిగే అవ‌కాశాలు ఉన్నాయని పేర్కొంది.

నైరుతి బంగాళ‌కాతంలో ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం కొన‌సాగుతోంది. ద‌క్షిణ కోస్తా, రాయ‌ల‌సీమ‌ల‌లో నిన్న కూడా వ‌ర్షాలు కురిశాయి. అంతే కాకుండా నేడు కూడా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది.

నేడు బంగ్లాదేశ్ భార‌త్ మ‌ధ్య మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్ గెలిస్తే 20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భార‌త్ సెమీస్ లో బెర్త్ ను సొంతం చేసుకున్న‌ట్టే.

Visitors Are Also Reading