Home » Nov 28th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Nov 28th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

 

తిరుమలలో వరుసగా 9వ నెలలోనూ శ్రీవారి హుండీ ఆదాయం వంద కోట్లు దాటింది. నవంబరులో హుండీ ద్వారా రూ.127.3 కోట్లను భక్తులు సమర్పంచుకున్నారు…. మార్చి నుంచి ప్రతినెలా రూ.100 కోట్లకు పైగా ఆదాయం రాగా జూలైలో అత్యధికంగా శ్రీవారికి రూ.139.35 కోట్ల ఆదాయం వచ్చింది.

Advertisement

ప.గో తాడేపల్లిగూడెంలో టీడీపీ అధినేత చంద్రబాబు యాత్రకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. నువ్వు వస్తే పథకాలు రద్దు.. నువ్వు వస్తే వెన్నుపోట్లు అంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

తమిళనాడులో డీఎంకే వర్సెస్ బీజేపీ వార్ కొనసాగుతోంది. ఆలయాల విషయంలో స్టాలిన్ నిర్ణయాలపై బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి ఫైర్ అయారు. ఆలయాలపై ప్రభుత్వ పెత్తనం మితిమీరుతోందని అన్నారు. ఆలయాలపై డీఎంకే తీరు మార్చుకోవాలని హితవు పలికారు.

ఎల్లుండి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖకు రానున్నారు. నేవీ డే ఉత్సవాల్లో రాష్ట్రపతి పాల్గొననున్నారు. ఏడు ప్రాజెక్టులను వర్చువల్‌గా రాష్ట్రపతి ప్రారంభించనున్నారు.

Advertisement

కాకినాడ ప్రత్తిపాడు జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీ కొన్నాయి. మంటలు చెలరేగడంతో ముగ్గురు సజీవదహనం అయ్యారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరు మృతిచెందారు.

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 65,568 మంది భక్తులు దర్శించుకున్నారు. తలనీలాలు 25,144 మంది భక్తులు సంరపించగా శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.26 కోట్లు వచ్చింది.

హైదరాబాద్‌ నాగోల్‌ కాల్పుల కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. బంగారం షాప్‌లోకి దుండగులు చొరబడినట్లు పోలీసులు గుర్తించారు… పల్సర్‌ బైక్‌, యాక్టివాపై దుండగులు వచ్చారని స్థానికులు చెబుతున్నారు. గోల్డ్ షాప్‌ షట్టర్‌ క్లోజ్‌ చేసి బెదిరింపులకు పాల్పడ్డారని షాప్‌లో విచక్షణారహితంగా కాల్పులు జరిపారని తేలింది.

నేడు మధ్యాహ్నం డీజీపీ మహేందర్‌రెడ్డిని కలవనున్న వైఎస్‌ షర్మిల.. పాదయాత్రకు భద్రత కల్పించాలని షర్మిల కోరనున్నారు.

ముగిసిన మంత్రి గంగుల, ఎంపీ గాయత్రి రవి సీబీఐ విచారణ.. 9 గంటల పాటు సీబీఐ వేర్వేరుగా విచారించారు.

తెలంగాణలో గ్రూప్‌-4 నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది. 9,168 పోస్టుల భర్తీకి నోటిఫకేషన్ జారీ చేశారు. ఈ నెల 23 నుండి వచ్చే నెల 12 వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జరగనుంది.

Visitors Are Also Reading