Home » Nov 28th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Nov 28th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

గుజరాత్‌లో నేటితో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగియనుంది. తొలివిడతలో 89 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ పోటీలో 788 మంది అభ్యర్థులు పాల్గొంటారు.

Advertisement

పవిత్ర లోకేష్ ఫిర్యాదుపై పోలీసుల విచారణ జరుగుతోంది. మొత్తం 10 యూట్యూబ్ ఛానళ్లకు నోటీసులు జారీ చేశారు. నరేష్ భార్య రమ్యరఘుపతిపై కేసు నమోదు చేయడం తో పాటూ… జర్నలిస్ట్ ఇమంది రామారావుకు సైబర్ క్రైమ్ పోలీసుల నోటీసులు అందజేశారు.

మేడ్చల్ జిల్లాలో రూ.250 కోట్ల స్కామ్ జరిగింది. ఏఎస్‌రావు నగర్‌లో బోర్డు తిప్పేసిన ఆర్.ఆర్.ఎంటర్‌ప్రైజెస్ యజమాని రమేష్‌రావు.. వత్తుల మెషీన్లు ఇప్పిస్తానని ఒక్కొక్కరి నుంచి రూ.10 లక్షలు వసూలు చేశారు.1500 మంది నుంచి రూ.250 కోట్లు వసూలు చేసి మెషీన్లు ఇవ్వకుండా పరార్ అయ్యాడు.

Ap cm jagan

Ap cm jagan

ఈరోజు ఉదయం 11 గంటలకు ఆర్ధిక శాఖపై సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, పథకాలకు నిధులపై సమావేశంలో చర్చ జరగనుంది.

Advertisement

తెలుగు రాష్ట్రాలలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్‌లో 8.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సిర్పూర్ (యు)లో 8.6 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా బేలాలో 9.9, నేరేడిగొండలో 9.9, మంచిర్యాలలో 10.7, నిర్మల్ జిల్లాలో పెంబిలో 10.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యాయి.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయ పడుతుండగా…. నిన్న శ్రీవారిని 67,468 మంది భక్తులు దర్శించుకున్నారు. 36,082 మంది భక్తులు తల నీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.16 కోట్లు వచ్చినట్టు సమాచారం.

అమరావతిలో టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీ కేసులో చిత్తూరు కోర్టు రద్దు చేసిన బెయిల్ పై మాజీ మంత్రి నారాయణ దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. నారాయణ తరఫున వాదన వినిపించిన అడ్వకేట్ సిద్ధార్థ లోధ్రా.. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేశారు.

జనవరి 18న తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రెండో దఫా కంటి వెలుగు పథకంపై మంత్రి హరీశ్ రావు రేపు వైద్యాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తారు. ఉదయం10.30 గంటలకు MCRHRDలో జరిగే సమావేశంలో అన్ని జిల్లాల డిఎంహెచ్వోలు, డిప్యూటీ డీఎంహెచ్వోలు పాల్గొంటారు.

Visitors Are Also Reading