కాసేపట్లో మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి ఐటీ విచారాణకు హాజరుకానున్నారు. నోటీసుల్లో హాజరవ్వాలని మాత్రమే ఉంది. డాక్యుమెంట్లు, బ్యాంకు లావాదేవీలు తీసుకురావాలని అధికారులు చెప్పలేదు. ఐటీ విచారణకు పూర్తిగా సహకరిస్తాం అంటూ మర్రి రాజశేఖర్ రెడ్డి వెల్లడించారు.
హైదరాబాద్‌లో నేటి నుంచి ట్రాఫిక్ స్పెషల్ డ్రైవ్ జరుగుతోంది. రాంగ్ రూట్ ట్రిపుల్ రైడింగ్ నిబంధనలు కఠినతరం చేశారు. రాంగ్ రూట్లో వెళ్తే రూ.1700…. ట్రిపుల్ రైడింగ్‌కు రూ.1200 ఫైన్ వేస్తున్నారు.
Advertisement
బండి సంజయ్ ఇంటి ముందు భారీగా పోలీసులు మోహరించారు. మధ్యాహ్నం తర్వాత పాదయాత్ర కార్యాచరణ పూర్తికానుంది. మధ్యాహ్నం తర్వాత పాదయాత్రపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఇవాళ ఐటీ విచారణకు మల్లారెడ్డి కుటుంబసభ్యులు సైతం హాజరవుతున్నారు. నేడు ఐటీ ముందు 14 మంది కుటుంబ సభ్యులు హాజరుకానున్నారు. 48 గంటల పాటు మల్లారెడ్డి కుటుంబసభ్యుల ఇళ్లలో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మల్లారెడ్డితో పాటు 16 మందికి అధికారులు నోటీసులు జారీ చేశారు. రూ.100 కోట్ల డొనేషన్లు వసూలు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Advertisement
చివరి ఘట్టానికి చేరుకున్న పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు. ఇవాళ పద్మావతి అమ్మవారి పంచమీ తీర్థం కార్యక్రమం జరగనుంది. తిరుమల శ్రీవారి నుంచి అమ్మవారికి పసుపు కుంకుమ సారె తీసుకువస్తారు. ఉదయం 11.40 గంటలకు అమ్మవారికి చక్రస్నానం జరిపిస్తారు.
అల్లూరి జిల్లా అరకు ఘాట్ రోడ్డులో షార్ట్ సర్క్యూట్ తో టూరిస్టు బస్సు దగ్దం అయ్యింది. ఈ ఘటనలో పర్యాటకులకు పెనుముప్పు తప్పింది. అరకులోయ నుంచి విశాఖపట్నం వెళ్తుండగా అనంతగిరి ఘాట్ రోడ్డు కాశీపట్నం సమీపంలో మంటలు చెలరేగాయి.
ట్విట్టర్ లో ట్వీట్ సైజ్ పెరగనునుంది. ప్రస్తుతం ట్వీట్ సైజు 280 క్యారెక్టర్ లు ఉండగా ఓ నెటిజన్ 420 కి పెంచాలని కోరాడు. దానికి మంచి ఆలోచన అంటూ ఎలాన్ మస్క్ బదులిచ్చాడు.
చైనాలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. 40 వేలకు పైగా రోజూవారి కేసులు నమోదవుతున్నాయి. నాలుగు రోజులుగా 30 వేలకు పైగానే కేసులు నమోదయ్యాయి.
ఏపీ సీఎం జగన్ నివాస ముట్టడికి గిరిజన సంఘాలు పిలుపునిచ్చాయి. తమను ఎస్టీలలో చేర్చవద్దని బెంతు బోయ, వాల్మీకి కులస్తులు డిమాండ్ చేస్తున్నారు.