Home » Nov 26th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Nov 26th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

నేడు శ్రీహరి కోట నుంచి ఉదయం 11.56 గంటలకు పీఎస్‌ఎల్‌బీ సీ-54 రాకెట్ ప్రయోగం జరగనుంది. కౌంట్ డౌన్ సవ్యంగా సాగుతోంది. రాకెట్ ద్వారా ఓషన్ శాట్ -3తో పాటు విదేశాలకు చెందిన 8 ఉపగ్రహాల ప్రయోగం జరగనుంది.


తిరుమలలో 18 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు. టోకేన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 60,157 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 31,445 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4 కోట్లు వచ్చింది.

Advertisement

వాహన ధరలు పెంచనున్నట్టు హీరో మోటోకార్ప్‌ ప్రకటించింది. ఒక్కో వాహనంపై రూ.1500 వరకు పెంచనున్నట్టు వెల్లదించింది.

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు వెంకటేశ్వర థియేటర్ లో ప్రమాదం చోటు చేసుకుంది. మెట్లపైన కూర్చుని ఉన్న ఇద్దరి పైకి ఇన్నోవా వాహనం దూసుకెళ్ళింది. దాంతో అంబేద్కర్ కాలనీ చెందిన పాండు (65) అక్కడికక్కడే మృతి చెందారు. మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

హైదరాబాద్ పాతబస్తీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చాంద్రాయణగుట్ట బండ్లగూడ ప్రాంతంలో పరుపుల గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో ఫైరింజన్ల సహాయం తో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో ఒకరికి తీవ్రగాయాలు కాగా ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు.

Advertisement

హైదరాబాద్ లో వచ్చే నెల 6న హైదరాబాద్ జలసౌధలో కృష్ణా నది యాజమాన్య బోర్డు ఆధ్వర్యంలోని త్రి సభ్య కమిటీ సమావేశం జరగనుంది. ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులకు సమాచారం కేఆర్ఎంబి మెంబెర్ సెక్రటరీ సమాచారం అందించారు. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాలకు నీటి కేటాయింపు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

హైదరాబాద్ పీసీసీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీని 12 మందికి కుదించారు. పూర్తి స్థాయి ప్రచార కమిటీని నియమించారు.. కో ఆర్డినెషన్ కమిటీ ఏర్పాటుకి కసరత్తు జరుగుతోంది. పీసీసీ, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి స్థాయిలో కసరత్తు పూర్తి అవుతోంది. డిసెంబర్ 4న ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే తో ఠాగూర్ భేటీ.. అనంతరం కమిటీలకు ఆమోదం తెలపనున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం ఛార్జి షీట్ లో కీలకాంశాలు బయటకు వచ్చాయి. ఎక్సైజ్ పాలసీలో కుట్ర జరిగింది.. పాలసీ కోసం భారీగా డబ్బులు చేతులు మారాయి.. పాలసీలో ప్రైవేట్ వ్యక్తుల పాత్ర ఉంది.. ఏడుగురిపై అభియోగాలు నమోదుచేశాం అంటూ సీబీఐ స్పష్టం చేసింది.

డిసెంబర్ 1 నుండి 3 వరకు ఉస్మానియా యూనివర్సిటీ PHD ఎంట్రన్స్ పరీక్షలు జరగనున్నాయి. ఒక్క నిముషం ఆలస్యమయినా నో ఎంట్రీ.. రేపటి నుండి హాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. 47 సబ్జెక్ట్స్ కు ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. ప్రతిరోజు మూడు సబ్జెక్ట్ లకు పరీక్ష జరగనుంది

Visitors Are Also Reading