Home » Nov 21st 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Nov 21st 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

హైదరాబాద్ క్యాసినో కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. నేడు ఈడీ ముందుకు డీసీసీబీ ఛైర్మన్ దేవేందర్ రెడ్డి, తలసాని పీఏ హరీష్ హాజ‌రుకానున్నారు. ఇప్పటికే విచారణకు హాజరైన ఎమ్మెల్సీ ఎల్ రమణ. ఇప్పటికే మంత్రి తలసాని సోదరులను ఈడీ విచారించింది.ఫెమా, హవాలా నగదు చెల్లింపులపై ఈడీ ఆరాతీస్తోంది.

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు జాతీయ రహదారిపై ముందు టైర్ పగిలి కారు అదుపుత‌ప్పింది. అనంత‌రం డివైడర్ ను ఢీ కొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం 108లో ఆసుపత్రికి తరలించారు.

Advertisement

ఢిల్లీ లిక్కర్ స్కాంలో నేటితో శరత్ చంద్రారెడ్డి, బినయ్ బాబుల ఈడీ కస్టడీ ముగియ‌నుంది. పదిరోజులకు పైగా శరత్ చంద్రారెడ్డి, బినయ్ లను ఈడీ విచారించ‌నుంది. ఇవాళ సీబీఐ స్పెషల్ కోర్టులో ఇద్దరిని ఈడీ
హాజ‌రుప‌ర‌చ‌నుంది.

సత్య సాయి జిల్లా ప్రశాంతి నిలయంలో జరిగే సత్యసాయి జయంతి వేడుకలలో పాల్గొనడానికి ఇస్రో చైర్మన్ సోమనాథ్ పుట్ట‌ప‌ర్తి చేరుకున్నారు.

Advertisement

Ap cm jagan

Ap cm jagan

ప.గో.జిల్లాలో ముఖ్యమంత్రి జగన్‌ పర్యటించ‌నున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్ లు జ‌రిగాయి. భీమవరంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాస వర్మ సైతం అరెస్టు అయ్యారు.

హైదరాబాద్ పాతబస్తీ బహదూర్ పురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ఎం గూడ అంబేద్కర్ విగ్రహం వద్ద పార్కింగ్ లో ఉన్న బస్సులో మంటలు చెలరేగాయి. దాంతో రెండు ఫైర్ ఇంజ‌న్ లు ఘటన స్థలానికి చేరుకున్నాయి. ఈ ఘ‌ట‌న‌లో ఒక బస్సు పూర్తిగా దగ్ధం అయ్యింది. మరో బస్సు పాక్షికంగా దగ్ధం అయ్యింది.కేసు నమోదు చేసి పోలీసులు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు.

ఆజ్‌ తక్‌ సాహిత్య సమ్మేళనంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. విచ్చిన్నకారుల పట్ల కవులు కలానికి పదును పెట్టాలని వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది నుంచి భారత్‌ జాగృతి ఫౌండేషన్ ప‌నిచేస్తుంద‌ని చెప్పారు.

ఉన్నత విద్యాశాఖలో అటెండెన్స్‌విషయంలో కీలక మార్పులకు ఏపీ ప్రభుత్వం సిద్దం అవుతోంది. విద్యార్థులకు సైతం ఫేషియల్‌ రికగ్నిషన్‌ ద్వారా అటెండెన్స్ సిస్టం ను అందుబాటులోకి తీసుకురావ‌డానికి ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబర్‌ మొదటివారం నుంచి ఇది అమలులోకి రానుంది.

Visitors Are Also Reading