Home » Nov 12 th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Nov 12 th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

నల్గొండ నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నాగులు అనే వ్యక్తి పెట్రోల్ పోసి ముగ్గురిపై హత్యాప్రయత్నం చేశాడు. స్నేహితుడికి ఫోన్ కాల్ ఆధారంగా నల్లగొండలో నిందితుడిని అరెస్ట్ చేశారు.

భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 133 వ జయంతి సందర్భంగా శాంతి వనంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, ఇతర నేతలు శ్రద్ధాంజలి ఘటించారు.

Advertisement

నేడు అమరావతి రాజధాని కేసుపై సుప్రీంకోర్టు లో విచారణ జరగనుంది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.

యాదాద్రి ఆలయానికి రికార్డ్ స్థాయిలో ఆదాయం వచ్చింది. ఆదివారం ఒక్కరోజే రూ. 1.09 కోట్ల ఆదాయం వచ్చింది. ఆలయ చరిత్రలో తొలిసారి ఆదాయం రూ. కోటి దాటింది.

Advertisement

మెదక్ చర్చి బిషప్ సాల్మన్‌రాజ్‌పై హత్యాయత్నం జరిగింది. చర్చి వెనుక భాగంలో ఈ ఘటన చోటచేసుకుంది. ఈ ఘటనలో అడ్డుకోబోయిన ఇద్దరికి గాయాలయ్యాయి.

మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హంతకులను వదిలేయడం సరికాదని వెంకయ్య నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజీవ్‌గాంధీని హత్య చేసిన వారిపట్ల సానుభూతి అవసరం లేదు.. రాజకీయాలు వేరని అన్నారు. ఉగ్రవాదం పట్ల అప్రమత్తంగా ఉండాలని కామెంట్ చేశారు.


ఎల్లుండి టీఆర్ఎస్‌ఎల్పీ, పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఎల్లుండి మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన భేటీ జరగనుంది. తెలంగాణ భవన్‌లో జరగనున్న సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం పాల్గొనబోతున్నారు.

Visitors Are Also Reading