Home » Nov 12 th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Nov 12 th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

ప్రధాని పర్యటనను నిరసిస్తూ ఓయూలో ఆందోళనకు దిగారు. AISF, SFI,TSMSF విద్యార్ధి నేతలు ఆందోళ‌న చేప‌ట్ట‌డంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.

కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మార్వో భద్రునాయక్ ను అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించి రూ.2.58 కోట్ల ఆస్తులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. బహిరంగమార్కెట్ లో ఆస్తి విలువ రూ.10 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Advertisement

సిమ్లా హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో ఎన్నిక‌ల పోలింగ్ ప్రారంభమయ్యింది. సీఎం ఠాకూర్ కుటుంబసభ్యులతో గుడికి వెళ్ళి పూజలు చేశారు. మండీలోని పోలీస్ స్టేషన్ లో ముఖ్యమంత్రి ఠాకూర్ ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. బీజేపీదే విజయం సాధిస్తుంద‌ని ఆయ‌న‌ ధీమా వ్యక్తం చేశారు.

modi

నేడు ఏపీ తెలంగాణ‌లో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ ప‌ర్య‌టిస్తున్నారు. మోడీ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 12 గంటల25 నిమిషాలకు విశాఖ నుండి బయలుదేరి 1.30 కి బేగంపేటకు చేరుకుంటారు. 1.40 నుండి 2 గంటల వరకు ఎయిర్ పోర్టులో స్వాగత సభ…2.15 కి బేగంపేట నుంచి రామగుండంకి పయనం కానున్నారు.

Advertisement

పంజాబ్ లోని అమృత్ సర్ లో పురాతన బుద్ధ విగ్రహం ను త‌ర‌లించేందుకు దుండ‌గులు ప్ర‌య‌త్నించారు. కస్టమ్స్ కళ్ళుగప్పి బుద్ధ విగ్రహాన్ని తరలించే యత్నం చేయ‌గా అట్టారీ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టు వద్ద కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు.

చెన్నైలో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. భారీవర్షాలకు చెన్నై నిండుకుండలా మారింది. కడలూరు,కాంచీపురం,మధురై, కన్యాకుమారి సహా పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై సహా 28 జిల్లాలో పాఠశాలలు,కాలేజీల కు ప్ర‌భుత్వం సెలవులు ప్రకటించింది.

హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా బంగారం పట్టుబ‌డింది. దుబాయ్ ప్రయాణీకుల‌ వద్ద రూ.3 కోట్ల విలువ చేసే 5.5 కేజీల బంగారంను అధికారులు సీజ్ చేశారు. బంగారాన్ని పేస్టుగా మార్చి తరలించేయత్నం చేశారు.

తిరుమలలో లగేజీ కౌంటర్ వద్ద భారీ వృక్షం కూలింది. చెట్టు కొమ్మ ఇన్నోవా కారుపై పడడంతో పాక్షికంగా ధ్వంసం అయ్యింది. భక్తులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం త‌ప్పింది.

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ నేడు విశాఖలో ప‌ర్య‌టిస్తున్నారు. పార్టీ ముఖ్యులతో ఆయ‌న‌ సమావేశం కానున్నారు. నిన్న ప్రధానమంత్రితో ప‌వ‌న్ అరగంట భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెల‌కొన్న పరిస్థితులు ప్ర‌ధానికి వివరించాన‌ని ప‌వ‌న్ తెలిపారు.

Visitors Are Also Reading