Home » తెలంగాణలో రాజ్య‌స‌భ ఎన్నిక‌కు నోటిఫికేష‌న్‌.. రేసులో ప్ర‌కాశ్‌రాజ్‌..?

తెలంగాణలో రాజ్య‌స‌భ ఎన్నిక‌కు నోటిఫికేష‌న్‌.. రేసులో ప్ర‌కాశ్‌రాజ్‌..?

by Anji
Ad

తెలంగాణ‌లో రాజ్య‌స‌భ ఉప ఎన్నిక‌కు సంబంధించి నోటిఫికేష‌న్ విడుద‌ల అయింది. టీఆర్ఎస్ ఎంపీ బండ ప్ర‌కాశ్ రాజీనామాతో ఖాళీ అయిన సీటుకు మే 12 నుంచి మే 19 వ‌ర‌కు నామినేష‌న్లు దాఖ‌లు చేయ‌డానికి ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ అవ‌కాశం క‌ల్పించింది. మే 20న నామినేష‌న్ల ప‌రిశీల‌న ప్ర‌క్రియ‌.. 30వ తేదీన ఉద‌యం 9 గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ నిర్వ‌హించ‌నున్నారు. అదేరోజు సాయంత్రం 5 గంట‌ల‌కు ఓట్ల‌ను లెక్కించి.. వెంట‌నే ఫ‌లితాలు ప్ర‌క‌టిస్తారు.


2018 ఏప్రిల్‌లో టీఆర్ఎస్ పార్టీ నుంచి నామినేట్ అయిన బండ ప్ర‌కాశ్ గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో త‌న ప‌ద‌వీకి రాజీనామా చేశాడు. బండ ప్ర‌కాశ్‌ను ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా సీఎం కేసీఆర్ ఎంపిక చేయ‌డంతో రాజ్య‌స‌భ స‌భ్వ‌త్వానికి రాజీనామా చేసారు. ఖాళీ అయిన ఆ సీటుకు ఇవాళ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. మ‌రొక‌సారి టీఆర్ఎస్ ఈ సీటును ద‌క్కించుకోనుంది. రాజ్య‌స‌భ స‌భ్యునిగా టీఆర్ఎస్ ఎవ‌రికీ ఇవ్వున్నారో అనేది స‌స్పెన్స్‌గా మారింది. కొత్త‌గా ఎంపీగా ఎన్నికైన వారు 2024 వ‌ర‌కు ఏప్రిల్ వ‌ర‌కు ప‌ద‌వీలో కొన‌సాగుతారు.

Advertisement

Advertisement

ముఖ్యంగా సినీ న‌టుడు ప్ర‌కాశ్‌రాజ్ పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. జాతీయ రాజ‌కీయాల్లో కీల‌క పాత్ర పోషించాల‌ని భావిస్తున్న కేసీఆర్ కు ప్ర‌కాశ్ రాజ్ మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. ఇటీవ‌ల మ‌హారాష్ట్ర సీఎంను క‌లిసిన సంద‌ర్భంలో ప్ర‌కాశ్ రాజ్‌ను త‌న వెంట తీసుకెళ్లిన కేసీఆర్‌.. ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రికి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేసారు. ఈ త‌రుణంలోనే ప్ర‌కాశ్‌రాజ్‌కు రాజ్య‌స‌భ సీటు ద‌క్కుతుంద‌ని జోరుగా ప్ర‌చారం కొన‌సాగుతుంది. మ‌రొక‌వైపు మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌, టీఆర్ఎస్ సీనియ‌ర్ నేత మోత్కుప‌ల్లి న‌ర‌సింహులు, న‌మ‌స్తే తెలంగాణ ఎండీ దామోద‌ర‌రావు పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో రాజ్య‌స‌భ్యునిగా కేసీఆర్ అవ‌కాశం ఎవ‌రికి ఇస్తారో అనేది త్వ‌ర‌లోనే తేల‌నుంది.

Also Read : 

“సర్కారు వారి పాట” సినిమాలో పవన్ ఫాన్స్ ని టార్గెట్ చేసి మరీ అవమానించారా ?

“సర్కారు వారి పాట” సినిమాలో పవన్ ఫాన్స్ ని టార్గెట్ చేసి మరీ అవమానించారా ?

 

Visitors Are Also Reading