Home » పోస్టల్ నుంచి గ్రూప్ 4 జాబ్స్ కి నోటిఫికేషన్.. అప్లై చేయండిలా..?

పోస్టల్ నుంచి గ్రూప్ 4 జాబ్స్ కి నోటిఫికేషన్.. అప్లై చేయండిలా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ఇండియన్ పోస్ట్ ఆఫీస్ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. దీనిలో భాగంగానే గ్రూప్ 4 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేటటువంటి అభ్యర్థులు 10వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది. అయితే ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు. అభ్యర్థుల యొక్క మార్కుల ఆధారంగా ఈ ఎంపిక ప్రక్రియ సమాచారం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నిరుద్యోగులు ఇదే సదవకాశంగా భావించి ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

Advertisement

ALSO READ;రైతన్న కు గుడ్ న్యూస్: భారీగా రుణమాఫీ.. కీలక నిర్ణయం తీసుకున్న కేసీఆర్..!!

Advertisement

ముఖ్యంగా దరఖాస్తు చేసే అభ్యర్థులంతా ఆఫ్లైన్ విధానంలో చేయాల్సి ఉంటుంది. అధికారిక వెబ్సైట్ నుండి అప్లికేషన్ ఫారంలు డౌన్లోడ్ చేసుకొని దానిలో వివరాలు నమోదు చేసి, తగిన ధ్రువపత్రాలను జత చేయాలి. దరఖాస్తుకు కావలసిన రుసుము చెల్లించి, అప్లికేషన్ మరియు ఫారం విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్ పత్రాలను మెయిల్ మోటార్ సర్వీస్, బెంగళూరు అడ్రస్ కు పంపించాల్సి ఉంటుంది.
పోస్టుల వివరాలు: మోటార్ వెహికల్ ఎలక్ట్రానిక్స్ 01, మోటార్ వెహికల్ మెకానిక్ 04,
ఉఫాల్స్టార్ 01, కాపర్ అండ్ టిన్ స్మిత్ 01 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తుల ప్రక్రియ డిసెంబర్ 08, 2022 నుంచి ప్రారంభం అయింది. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా డిసెంబర్ 31, 2022గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

దరఖాస్తు రుసుము:
జనరల్ మరియు ఓ బీసీ అభ్యర్థులు 100 రూపాయలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఇలాంటి ఫీజు లేకుండా అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ప్రకారం చూస్తే అభ్యర్థుల యొక్క వయసు 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు మయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ముఖ్యంగా మోటార్ వెహికల్ మెకానిక్ పోస్టుకు దరఖాస్తు చేసే అభ్యర్థులు, లైట్ మరియు హెవీ మోడల్ డ్రైవింగ్ లైసెన్స్ పొంది ఉండాలి. వెహికల్ మోటర్ మెకానిజం పై పరిజ్ఞానం ఉండాలి.

ALSO READ;ఏడాదిలోపు పిల్లలు ఉన్నారా.. ఫుడ్ విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!

Visitors Are Also Reading