Home » ఏపీ అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌..ఖాళీలు, భర్తీ వివరాలు ఇవే

ఏపీ అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌..ఖాళీలు, భర్తీ వివరాలు ఇవే

by Bunty
Ad

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే, నిరుద్యోగులలో ఉన్న అసంతృప్తిని తగ్గించేందుకు వరుసగా ఉద్యోగాల నోటిఫికేషన్‌ ను విడుదల చేస్తోంది జగన్‌ సర్కార్‌. ఈ నేపథ్యంలోనే మరో నోటిఫికేషన్‌ రిలీజ్‌ చేసింది ఏపీ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు.

Advertisement

వైయస్సార్ జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ కార్యాలయం ఉద్యోగాలను భర్తీ చేయనుంది. వైయస్సార్ జిల్లాలోని వివిధ ఐసిడిఎస్ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయనున్నారు. మహిళా అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? లాంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అంగన్వాడీ పోస్టుల నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 148 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో అంగన్వాడీ వర్కర్ (37), అంగన్వాడి హెల్పర్(108), అంగన్వాడి మినీ వర్కర్(03), పోస్టులను భర్తీ చేయనున్నారు.

Advertisement

అంగన్వాడి వర్కర్ పోస్టులకు 10వ తరగతి, అంగన్వాడి హెల్పర్, అంగన్వాడి మినీ వర్కర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏడో తరగతి పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 01-07-2023 నాటికి 21 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులను సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో పొంది, తిరిగి ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో అందించాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు 11-01-2023ని చివరి తేదీగా నిర్ణయించారు. ఇంటర్వ్యూలను సంబంధిత డీఆర్డివో కార్యాలయాల్లో 12-01-2023తేదీన నిర్వహిస్తారు.

READ ALSO : సూర్య భీకర సెంచరీ.. రికార్డులన్నీ బద్దలు! టీ20 చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా..!

Visitors Are Also Reading