Home » F3 చిత్రంలో ఈ మిస్టేక్ గమనించారా.. ఇదెలా మిస్సయ్యారు అనిల్ రావిపూడి..!!

F3 చిత్రంలో ఈ మిస్టేక్ గమనించారా.. ఇదెలా మిస్సయ్యారు అనిల్ రావిపూడి..!!

by Sravanthi Pandrala Pandrala
Published: Last Updated on
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎన్నో కామెడీ సినిమాలు వచ్చాయి. ఇందులో చాలా వరకు సూపర్ హిట్ అయ్యాయి. అలాంటి సినిమాల్లో కొన్ని నెలల కిందట వచ్చిన ఎఫ్ 3 సినిమా ఎంతటి హిట్ అయిందో మనందరికీ తెలుసు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ త్రీ మూవీ లో స్టార్ హీరో వెంకటేష్, వరుణ్ తేజ్ లు నటించారు. ఈ ఇద్దరు హీరోలు చేసిన కామెడీ సినిమాను మరో లెవల్లో నిలబెట్టింది అని చెప్పవచ్చు. ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు కడుపుబ్బ నవ్వుకున్నాడు. అయితే ఈ సినిమాను రెండు భాగాలుగా తీసుకొచ్చారు దర్శకుడు. ముందుగా ఎఫ్2 సినిమాను రిలీజ్ చేసి సూపర్ హిట్ కొట్టారు.

also read:బాలకృష్ణ పెళ్ళికి ఎన్టీఆర్ ఎందుకు రాలేదో తెలుసా..?

Advertisement

 

ఈ క్రమంలోనే మరో సీక్వెల్ వస్తుందని అప్పుడే ప్రకటించారు ఆ సినిమానే ఎఫ్ త్రీ. ఈ చిత్రం కూడా ప్రేక్షకుడి ని ఎంతగానో అలరించింది. టైమింగ్ కామెడీతో అందరు అదరగొట్టేశారు..ఈ సినిమాలో వెంకేటేష్ సరసన తమన్నా,వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ కౌర్ నటించ‌గా, అదనంగా సోనాల్ చౌహాన్ నటించింది.ఐటెం సాంగ్‌లో పూజా హెగ్డే నటించింది. అయితే ఈ సినిమాలో హీరో వెంకటేష్ కు రే చీకటి, హీరో వరుణ్ తేజ్ కు నత్తి ఉంటుంది. వీళ్లకున్న ప్రాబ్లమ్స్ తో కామెడీని ఎంతో బాగా పర్ఫార్మ్ చేశారు. అలాంటి ఈ మూవీలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేశారు.

Advertisement

also read:విష్ణు మ‌నోజ్ ల గొడ‌వపై మంచు ల‌క్ష్మి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

ఈ సాంగులో పూజా హెగ్డే తో వెంకటేష్ వరుణ్ తేజ్ లు కలిసి డ్యాన్స్ చేస్తారు. తెలిసిన విషయమే కదా అనుకుంటున్నారా.. కానీ ఇక్కడే ఉంది అసలు లాజిక్ .. ఇందులో వెంకటేష్ కు రేచీకటి అని చెప్పారు కదా మరి పూజా హెగ్డే తో చేసిన డ్యాన్సు నైట్ టైం జరుగుతుంది. ఇందులో వెంకటేష్ ఎక్కడ కూడా మిస్టేక్ లేకుండా బాగానే చేశారు కదా. మరి ఆ సమయంలో ఆయన రేచీకటి లేదా .. అంటూ కొంతమంది నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఇంత చిన్న మిస్టేక్ ఎలా మిస్ అయ్యారు అనిల్ రావిపూడి అంటూ కామెంట్లు పెడుతున్నారు.

also read:ఆదివారం రోజు మాంసం తింటే ఏమవుతుందో తెలుసా ?

Visitors Are Also Reading