Home » Jabardasth Faima: కామెడీనే కాదు కోట్లు సంపాదించిన ఫైమా.. ఆస్తుల విలువ ఎంతంటే..?

Jabardasth Faima: కామెడీనే కాదు కోట్లు సంపాదించిన ఫైమా.. ఆస్తుల విలువ ఎంతంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

బుల్లితెర కామెడీ షో పటాస్ ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఫైమా జబర్దస్త్ ద్వారా మంచి కమెడియన్ గా పేరు సంపాదించుకుంది. కామెడీ పంచులకు పెట్టింది పేరు పైమా. అలాంటి ఆమె నిలువ నీడలేని పరిస్థితి నుండి హైదరాబాదులో ఇల్లు, స్థలాలు కూడా కొనుక్కుని ఓ స్థాయికి ఎదిగిందని తెలుస్తోంది.అలాంటి పైమా గురించి కొన్ని విషయాలు చూద్దాం.. చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో తల్లి కూలి పనులు చేస్తూ తన ముగ్గురు అక్క చెల్లెళ్లను పెద్ద చేసింది. అద్దె ఇంట్లో ఉంటూ కనీసం బాత్రూం, సౌకర్యం కూడా లేదు.

also read:కొబ్బరికాయలతో ఇలా చేస్తే ఎంతటి డబ్బు సమస్య అయినా ఇట్టే దూరం..!!

Advertisement

పైమా కుటుంబ పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. కానీ అలాంటి పరిస్థితులను పైమా మార్చేసిందని చెప్పవచ్చు. ఎంతో కష్టపడి వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని జబర్దస్త్ వైపు అడుగులు వేసింది. తన రూపం, మాటలతో నవ్విస్తూ జబర్దస్త్ లో టాప్ కమెడియన్ స్థాయికి చేరుకుంది. ఫైమా కామెడీ చూసిన టీమ్ లీడర్స్ ఆమెకు స్కిట్ లో స్పేస్ ఎక్కువగా ఇస్తూ ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. అలా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ జబర్దస్త్ లో స్టార్ కమెడియన్ గా ఎదిగింది. ఆ తర్వాత బిగ్ బాస్ ఆఫర్ తో ఆమెకు మరింత గుర్తింపు వచ్చింది. తనదైన ఆటతీరుతో ఫైమా ఫైనల్ వరకు రాణించిందని చెప్పవచ్చు.

Advertisement

also read:ఆ హీరో చనిపోవడం గురించి భూమిక కామెంట్స్ వైరల్..!

 

అయితే ఆమెకు బిగ్ బాస్ నుంచి కూడా భారీగానే పారితోషికం అందినట్టు తెలుస్తోంది. ఇలా ఫైమా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ తన సొంతింటి కల నెరవేర్చుకుంది. అంతేకాదు ఒక కారు కూడా కొనుక్కుంది. జబర్దస్త్ ద్వారా వచ్చే అమౌంటు, ఇతర ఈవెంట్లు, యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చే అమౌంట్ ఇలా రకరకాల షోలు చేస్తూ చాలా డబ్బులు పోగేసుకుంది. అలా ఇల్లు, కారు కొనుక్కొని ఉన్నదాంట్లో హ్యాపీగా ముందుకు వెళ్తోంది. అలా పైమా సంపాదించిన ఆస్తులు కోటికి పైగానే ఉంటాయని తెలుస్తోంది.

also read:కోడి ముందా గుడ్డు ముందా?.. నిజాన్ని బయటపెట్టిన CHAT GPT.. చూస్తే నమ్మలేరు..!!

Visitors Are Also Reading