Telugu News » Blog » ఏపీ అసెంబ్లీలో సెల్‌ఫోన్ల‌కు నో ప‌ర్మిష‌న్

ఏపీ అసెంబ్లీలో సెల్‌ఫోన్ల‌కు నో ప‌ర్మిష‌న్

by Anji
Ads

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ లోకి సెల్ ఫోన్‌ల‌కు అనుమ‌తి లేదంటూ స్పీక‌ర్ త‌మ్మినేని రూలింగ్ ఇచ్చారు. స‌భ‌లో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను సెల్‌ఫోన్ లో రికార్డు చేసి మీడియా చేర‌వేస్తున్నార‌న్న స‌మాచారం త‌మ‌కు ఉంద‌ని స్పీక‌ర్ చెప్పారు. స్పీక‌ర్ రూలింగ్ పై టీడీపీ స‌భ్యులు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. వైసీపీ స‌భ్యులు కూడా సెల్ ఫోన్లు తీసుకొస్తున్నార‌ని టీడీపీ స‌భ్యులు చెప్ప‌డంతో ఎవ్వ‌రూ సెల్‌ఫోన్లు స‌భ‌లోకి తీసుకురాకూడ‌ద‌ని స్పీక‌ర్ స్ప‌ష్టం చేసారు.

సెల్ ఫోన్ల‌ను వాలంట‌రీగా స‌రెండ్ చేయాల‌ని స్పీకర్ స‌భ్యుల‌కు సూచించారు. స‌భ‌లో సూచ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా టీడీపీ స‌భ్యులు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని స్పీక‌ర్ త‌మ్మినేని అన్నారు. మార్ష‌ల్స్ వారి విధుల‌ను వాళ్లు నిర్వ‌హిస్తున్నార‌ని చెప్పారు.


You may also like