మెగాస్టార్ చిరంజీవి ఇప్పటివరకు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలతో ప్రేక్షకులకు ముందుకు వచ్చారు. చిరంజీవిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి మెగాస్టార్ గా ఎదిగారు. ఇక చిరంజీవి కెరీర్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉండగా వాటిలో కొన్ని సినిమాలు మాత్రం ప్రత్యేకమనే చెప్పాలి. అలాంటి సినిమాలలో అడవి దొంగ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాతో పాటు విజేత సినిమా 1980వ దశంలో విడుదలయ్యాయి. విజేత సినిమా విడుదలైన కొద్ది రోజుల గ్యాప్ లోనే అడవి దొంగ విడుదలైంది.
Advertisement
ఇక ఈ సినిమాకు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో చిరంజీవికి మాటలు లేకపోవడంతో అభిమానులంతా షాకయ్యారు. ఇది ఎక్కడి సినిమా అంటూ తలలు బాదుకున్నారు. కానీ సెకండ్ హాఫ్ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. చిరంజీవి నటన… డాన్స్ చూసి అవాక్కయ్యారు.
Advertisement
ఇక ఈ సినిమానే మెగాస్టార్ ను కమర్షియల్ హీరోగా నిలబెట్టింది. ఈ సినిమా హైదరాబాదులోని చాలా థియేటర్లలో ఐదు షోలు ప్రదర్శించగా అన్నిషోలు హౌస్ ఫుల్ అయ్యాయి. ఈ అరుదైన రికార్డును ఇప్పటివరకు ఎవరు సాధించలేదు. ఇదిలా ఉండగా చిరంజీవి ఇప్పటివరకు 151 సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.
చివరగా మెగాస్టార్ ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచింది. అయినప్పటికీ మెగాస్టార్ కుర్ర దర్శకులతో వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం మెగాస్టార్ గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా దసరాకు విడుదల కానుంది. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.