ఓ సినిమా అనేది హిట్ అయితే అందులో నటించిన ప్రతి ఒక్క యాక్టర్ కు అవకాశాలు అనేవి వస్తాయి. ఇక అదే హీరో, హీరోయిన్స్ కు అయితే చెప్పాల్సిన అవరసం లేదు. సినిమాపై మంచి టాక్ ఉంటె విడుదలకు ముందే అవకాశాలు అనేవి వారి వద్దకు వస్తాయి. కానీ శ్రీ నిధి శెట్టికి మాత్రం అలా కావడం లేదు. అయితే మన దేశంలో కేజీఎఫ్ అనే సినిమా ఎంత పెద్ద హిట్ అనే విషయం చెప్పాల్సిన అవసరం లేదు.
Advertisement
ఈ సినిమా రెండవ భాగం మాత్రం 1100 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్ చేసి వసూళ్ల సునామి సృష్టించింది అనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో హీరో గా యష్ నటిస్తే హీరోయిన్ గా శ్రీ నిధి శెట్టి నటించింది. ఇక ఈ సినిమా విడుదల అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతున్నా.. యష్ మంచి కథ కోసం ఆగుతున్నాడు. కానీ హీరోయిన్ శ్రీ నిధి మాత్రం అవకాశాలే రావడం లేదట.
Advertisement
శ్రీ నిధి ప్రస్తుతం కేజీఎఫ్ కంటే ముందే ఒప్పుకున్నా ఒక్క కోబ్రా సినిమాలోనే చేస్తుంది. కానీ కేజీఎఫ్ విడుదల తర్వాత ఈమెకు రెండు అవకాశాలు రాగ… రెమ్యునరేషన్ ఎక్కువ అడిగి వాటికీ నో చెప్పింది. దాంతో అప్పటి నుండి ఇప్పటివరకు మళ్ళీ శ్రీ నిధికి వేరే సినిమా నుండి ఛాన్స్ రాలేదు అని తెలుస్తుంది. మరి ఇప్పుడు విడుదల కాబోతున్న కోబ్రా సినిమా తర్వాత అయిన శ్రీ నిధి బిజీ అవుతుందో చూడాలి మరి.
ఇవి కూడా చదవండి :