Home » భీమ్లా నాయ‌క్ పై కోపంలో నిత్యామీన‌న్…!

భీమ్లా నాయ‌క్ పై కోపంలో నిత్యామీన‌న్…!

by AJAY
Ad

ప‌వ‌న్ క‌ల్యాణ్ నిత్యా మీన‌న్ జంటగా న‌టించిన సినిమా భీమ్లా నాయ‌క్. ఈ సినిమాకు సాగ‌ర్ కే చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమాలో ప‌వ‌న్ తో పాటూ రానా కూడా ముఖ్య‌మైన పాత్ర‌లో న‌టించారు. ఈ సినిమాను మ‌ల‌యాళ సినిమా అయ్య‌ప్ప‌నుమ్ కోషియం కు రీమేక్ గా తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమ‌లో రానాకు జోడీగా సంయుక్త మీన‌న్ హీరోయిన్ గా నటించ‌గా ప‌వ‌న్ క‌ల్యాణ్ కు జోడీగా నిత్యామీన‌న్ హీరోయిన్ గా న‌టించింది.

Advertisement

అయితే నిత్యామీన‌న్ కేవ‌లం త‌న పాత్ర‌కు ప్రాముఖ్య‌త ఉన్న పాత్ర‌ల్లో న‌టిస్తుంద‌న్న సంగ‌తి తెలిసిందే. ఆ కార‌ణంతోనే నిత్యా మీన‌న్ చాలా సినిమాల‌కు నో చెప్పింది. అయితే ఇప్పుడు నిత్యా మీన‌న్ భీమ్లా నాయ‌క్ సినిమా విష‌యంలోనూ హ‌ర్ట్ అయిన‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ప‌వ‌న్ కు భార్య‌గా నిత్యామీన‌న్ న‌టించిన తీరు ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది.

Advertisement

అయితే ఈ సినిమాలో అంత ఇష్టం ఏంద‌య్యా అనే పాట‌ను మొద‌ట విడుద‌ల చేసి సినిమాలో క‌ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ పాట నిత్యామీన‌న్ కు ఎంతో న‌చ్చ‌డంతో పాటూ పాట‌లో ఆమెకు ప్రాధాన్య‌త ఇచ్చార‌ట‌. దాంతో ఈ పాట‌ను సినిమా నుండి తీసేయ‌డం పై నిత్యా మీన‌న్ కోపంలో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఆ కార‌ణంతోనే ప్రీరిలీజ్ ఈవెంట్ కు కూడా నిత్యామీనన్ దూరం అయింద‌ని టాక్. మ‌రోవైపు ఈ ఈవెంట్ లో నిత్యా మీన‌న్ పేరును ఎక్క‌డా ఎత్త‌క‌పోవ‌డం తో ఆ వార్త‌ల‌కు బ‌లం చేకూరుతోంది.

Visitors Are Also Reading