Home » బాలీవుడ్ సంస్థ వల్ల ప్రమాదంలో నిత్య కెరియర్..!

బాలీవుడ్ సంస్థ వల్ల ప్రమాదంలో నిత్య కెరియర్..!

by Azhar
Ad

టాలీవుడ్ లో ప్రస్తుతం చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. కానీ అందులో తమ నటనతో గుర్తింపు అనేది తెచుకునేవారు మాత్రం కొందరే. ఇక అలాంటి హీరోయిన్స్ లిస్ట్ లో కేరళ కుట్టి నిత్య మీనన్ ముందుంటుంది. తన కళ్ళతో అందరిని కట్టిపడేసే నిత్య మీనన్ మంచి నటి అనేది అందరికి తెలిసిందే. రెమ్యునరేషన్ కోసం కాకుండా కథ కోసం సినిమా అనేది చేస్తుంది.

Advertisement

ఇప్పటివరకు తెలుగులో ఎన్నో హిట్ సినిమాల్లో చేసిన నిత్య మీనన్… కొన్ని ప్రయోగాలు చేసి బోర్లా పడింది కూడా. అయిన కూడా నాకు కథ అలాగే నా పాత్రనే ముఖ్యం అంటుంది ఈ అమ్మడు. అయితే కేరళ నుండి టాలీవుడ్ లోకి వచ్చిన మొదట్లో వరుస సినిమాలతో నిత్య మీనన్ బిజీగా ఉండేది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్ లో కూడా సినిమా చేసింది.

Advertisement

ఇక ఇక్కడే నిత్య మీనన్ ఓ తప్పు అనేది చేసినట్లు తెలుస్తుంది. బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న సమయంలో తన డేట్స్ అనేవి ఓ ప్రముఖ బాలీవుడ్ సంస్థకు నిత్య మీనన్ ఇచ్చిందట. ఇక వారిని అడగకుండా నిత్య మీనన్ ఎవరికీ డేట్స్ ఇవ్వలేదట. కానీ నిర్మాతలే నేరుగా ఆ సంస్థతో డీల్ చేయడం కష్టం అని తెలుస్తుంది. ఇక ఈ కారణంగానే నిత్య మీనన్ కావాలి అనుకున్న… ఇంత పెద్ద ప్రాసెస్ ఫాలో కాలేక ఆ అమ్మడినీ వదులుకుంటున్నారట..!

ఇవి కూడా చదవండి :

పాకిస్థాన్ ఫ్యాన్ కు లక్షల ఫైన్ వేసిన ఆస్ట్రేలియా..!

కోహ్లీకి ఐసీసీ ట్రిబ్యూట్..!

Visitors Are Also Reading