Home » నితిన్ కొత్త సినిమా ఎప్పుడు.. ఎందుకు ఆలస్యం..?

నితిన్ కొత్త సినిమా ఎప్పుడు.. ఎందుకు ఆలస్యం..?

by Azhar
Ad

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న చిన్న హీరో నుండి పెద్ద హీరో వరకు అందరూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. కరోనా తర్వాత ప్రతి హీరో కూడా మూడు మూడు సినిమాలను లైన్ లో పెట్టుకొని వాసా షూటింగ్స్ అనేవి చేస్తూ వస్తున్నారు. అయితే టాలీవుడ్ లో స్టార్ లలో ఒక్కడు అయిన నితిన్ మాత్రం తన కొత్త సినిమా కోసం చాలా ఆసల్యం చేస్తున్నాడు.

Advertisement

అయితే నితిన్ గతేడాది రంగ్ దే,చెక్, మాస్ట్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ ఏడాది మాచర్ల నియోజకవర్గం అనే సినిమా చేసాడు. కానీ ఇందులో ఏ ఒక్క సినిమా కూడా అనుకున్నంతా రేంజ్ లో ఆడలేదు అనేది అందరికి తెలుసు. అయితే ఇప్పుడు తన కొత్త సినిమా కోసం నితిన్ ఫ్యాన్స్ వేచి చూసేలా చేస్తున్నాడు. అయితే గతంలోనే తాను దర్శకుడు వక్కంతం వంశీతో సినిమా చేయనున్నట్లు ప్రకటించాడు.

Advertisement

కానీ ఇంకా కూడా ఈ సినిమా షూటింగ్ అనేది ఆరంభం కాలేదు. అందుకు కారణం వక్కంతం వంశీ కథను ఇంకా పూర్తిగా సిద్ధం చేయలేదు అని తెలుస్తుంది. గత రెండేళ్లుగా ఈ కథ పైనే ఉన్న వక్కంతం వంశీ.. కథ విషయంలో సంతృప్తి అనేది చెందడం లేదు అని సమాచారం. అయితే ఈ కథపూర్తి చేయడనికి వక్కంతం వంశీకి కనీసం ఇంకా రెండు నెలల సమయం అనేది పడుతుంది అని సమాచారం. అంటే నితిన్ కొత్త సినిమా డిసెంబర్ లో మొదలవుతుంది.

ఇవి కూడా చదవండి :

షమీ ప్రపంచ కప్ జట్టులోకి రావాల్సిందే..?

ఇండియాను క్యాష్ చేసుకోవాలనుకున్న ఇంగ్లాండ్..!

Visitors Are Also Reading