Home » సౌత్ లో నంబర్ 1 స్టార్ గా నితిన్ సరికొత్త రికార్డు ….!

సౌత్ లో నంబర్ 1 స్టార్ గా నితిన్ సరికొత్త రికార్డు ….!

by AJAY
Ad

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ సరికొత్త సౌత్ లోనే సరికొత్త రికార్డును క్రియేట్ చేసారు. నితిన్ హీరోగా నటించిన సినిమాలు హిందీలో కూడా డబ్ అయ్యాయి. అయితే ఈ సినిమాలకు యూట్యూబ్ లో ఏకంగా 23బిలియన్ల కు పైగా వ్యువ్స్ వచ్చాయి. అయితే టాలీవుడ్ నుండి మాత్రమే కాకుండా కోలీవుడ్ నుండి కూడా పలువురు స్టార్ హీరోల సినిమాలు యూట్యూబ్ లో హిందీ లో డబ్ అయ్యాయి కానీ ఆ హీరోల సినిమాలకు రాని వ్యూవ్స్ నితిన్ సినిమాకు రావడం విశేషం.

Advertisement

Advertisement

అంతే కాకుండా నితిన్ ఫ్యాన్స్ కూడా ఇది గర్వించాల్సిన విషయం. నితిన్ సినిమాలకు వచ్చిన వ్యూవ్స్ తో బాలీవుడ్ ప్రేక్షకులు సైతం నితిన్ ను ఇష్టపడతారని అర్థం అవుతోంది. కాబట్టి నితిన్ తన సినిమాలకు హిందీ లో కూడా విడుదల చేస్తే కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా నితిన్ యూత్ స్టార్ గా టాలీవుడ్ లో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. 2002 లో నితిన్ జయం సినిమా తో టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. ఈ సినిమా మంచి విజయం సాధించడం తో వరుస ఆఫర్స్ అందుకున్నారు. కొన్నేళ్ల తర్వాత వరుస ఫ్లాప్ లు ఇబ్బంది పెట్టగా మళ్లీ ఇష్క్ సినిమా తో ట్రాక్ లోకి వచ్చాడు. ఇక రీసెంట్ గా నితిన్ హీరోగా చేసిన మ్యాస్త్రో సినిమా ఓటిటిలో విడుదల కాగా మంచి విజయం సాధించింది.

Visitors Are Also Reading