Home » పవన్, ప్రభాస్ లపై కొమురం పులి హీరోయిన్ హాట్ కామెంట్స్…!

పవన్, ప్రభాస్ లపై కొమురం పులి హీరోయిన్ హాట్ కామెంట్స్…!

by AJAY
Ad

కొమురం పులి సినిమాతో టాలీవుడ్ పరించయం అయిన బ్యూటీ నికీషా పటేల్. అందం అభినయం ఉన్నా ఈ బ్యూటీ టాలీవుడ్ లో సక్సెస్ అందుకోలేక పోయింది. మొదటి సినిమాలోనే పవన్ కళ్యాణ్ పక్కన ఛాన్స్ కొట్టేసిన ఆ తరవాత మాత్రం ఛాన్స్ లు వెతుక్కుని రాలేదు.

Advertisement

దానికి కారణం ఈ సినిమా విజయం సాధించకపోవడం కూడా. ఇక ఈ సినిమా తరవాత మరో సినిమా చేసినా ఆ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దాంతో నికీషా మళ్లీ ఏ సినిమాలో కనిపించలేదు. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం అభిమానులతో ముచ్చటిస్తూ సందడి చేస్తోంది.

Advertisement

Pawan kalyan

Pawan kalyan

తాజాగా నికీషా పటేల్ అభిమానులతో చిట్ చాట్ చేసింది. దాంతో ఓ అభిమాని పవన్ కళ్యాణ్ గురించి చెప్పండి అంటూ ప్రశ్నించాడు. దానికి నికీషా పవన్ కళ్యాణ్ ఇప్పుడు గడ్డం లుక్ తో బాగున్నారు అంటూ కామెంట్ చేసింది. మరో నెటిజన్ ప్రభాస్ గురించి చెప్పాలి అంటూ కోరాడు. దానికి నికీషా ప్రభాస్ మంచి స్నేహితుడు అని తెలిపింది. హంబుల్ గా ఉంటాడని తన కంటే పొడవు అంటూ కామెంట్ చేసింది.

Visitors Are Also Reading