Home » కార్తికేయ 3 పై నిఖిల్ క్లారిటీ..!

కార్తికేయ 3 పై నిఖిల్ క్లారిటీ..!

by Azhar
Ad
కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా గత నెలలో విడుదల అయిన కార్తికేయ 2 అనే సినిమా ఎంత పెద్ద హిట్ అందుకుంది అనే విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాలో నిఖిల్, అనుపమ జంటగా నటించారు. అయితే ఈ సినిమా విడుదల కోసం ఎన్ని కష్టాలు పడిందో.. అంత పెద్ద విజయం సాధించింది అనే చెప్పాలి. తెలుగుతో పాటు హిందీలో కూడా విడుదల అయిన ఈ రేపు మలయాళంలో కూడా విడుదల కాబోతుంది.
అయితే ఈ సినిమా సౌత్ కంటే నార్త్ పెద్ద హిట్ అందుకుంది. అందుకు కారణం ఈ సినిమా శ్రీ కృష్ణుడి మీద రావడం. దానితో ఈ సినిమాకు ఫ్యాన్స్ బ్రహ్మరథం పట్టారు. అయితే 120 కోట్ల కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ఈ సినిమాకు మరో సీక్వెల్ కూడా రానుంది అనే విషయం తెలిసిందే. కార్తికేయ 3 గా వచ్చే ఈ సినిమాల్లో కృష్ణుడి గురించి ఇంకా వివరించనున్నారు.
కార్తికేయ 2 సినిమాను కూడా అదే విధంగా ఎండ్ చేసారు అనేది తెలిసిందే. ఇక తాజాగా కార్తికేయ 3 సినిమా గురించి నిఖిల్ మాట్లాడుతూ… మూడో సినిమా తప్పకుండ వస్తుంది. అది ఫిక్స్. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఇంకా చాలా విషయంలో త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తాం అని చెప్పాడు. ఇక ఈ మధ్యే ఈ సినిమా డైరెక్టర్ చందు మొండేటి కార్తికేయ 3 అనేది పాన్ ఇండియా సినిమాగా వస్తుంది అని ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement

Visitors Are Also Reading