ఇండస్ట్రీలో సినిమా విడుదల వార్తల కంటే విడాకుల వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎప్పుడూ ఎవరో ఒక సెలబ్రెటీ విడాకుల వార్త నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. మొన్నటి వరకూ సమంత నాగచైతన్యల విడాకుల వార్తలు వినిపించాయి. ఆ తరవాత ఇద్దరూ విడాకులు తీసుకుని ఎవరి లైఫ్ తో వాళ్లు బిజీగా ఉన్నారు. ఇక నిన్నటి వరకూ మెగా డాటర్ శ్రీజ కల్యాణ్ ల విడాకుల వార్త వైరల్ అయ్యింది.
Advertisement
ALSO READ : వినోదయ సీతమ్ రీమేక్..పవన్ పక్కకు జరగడంతో డూప్ తో షూటింగ్..!
అయితే ఈ జంట విడాకులు తీసుకోలేదు కానీ ఒకరికొకరు మాత్రం దూరంగానే ఉంటున్నారు. చాలా కాలం పాటూ వీరిద్దరూ దూరంగా ఉంటున్నట్టు టాక్. మరోవైపు సోషల్ మీడియాలో ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలను డిలీట్ చేశారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో మెగాడాటర్ నిహారిక విడాకుల వార్తలు సైతం గుప్పుమంటున్నాయి. దానిని కూడా కొన్ని కారణాలు ఉన్నాయి.
Advertisement
నిహారిక చైతన్య జొన్నగడ్డలను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా నిహారిక తన సోషల్ మీడియాలో చైతన్యకు సంబంధించిన చాలా ఫోటోలు డిలీట్ చేసింది. కేవలం ఓ ఫోటో మరియు వీడియోను మాత్రమే డిలీట్ చేయకుండా ఉంది. దాంతో విడాకుల వార్తలు ఒక్కసారిగా మొదలయ్యాయి. ఇప్పుడు ఈ జంట కూడా విడాకులు తీసుకోబోతుందా అన్న టెన్షన్ అభిమానుల్లో నెలకొంది. ఇదిలా ఉంటే విడాకుల తరవాత నిహారిక మొదటిసారి తన ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో నిహారిక చీరకట్టులో మెరిసిపోతుంది.
Advertisement
ALSO READ : మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్ లో నాని దసరా సినిమా రెమ్యునరేషన్… మొత్తం ఎన్ని కోట్లంటే..?