సినిమా ఇండస్ట్రీలో వరుస విడాకుల వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. అంగరంగవైభవంగా పెళ్లిళ్లు చేసుకున్న తారలు విడాకులు ప్రకటిస్తుండటంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
Advertisement
ఇప్పటికే పలు జంటలు విడాకులు తీసుకుని ఎవరిదారి వాళ్లు చూసుకోగా తాజాగా మరో జంట విడాకులు తీసుకోబోతుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆ జంట మరెవరో కాదు నిహారిక చైతన్య…మెగాడాటర్ నాగబాబు ముద్దుల కుమార్తె నిహారిక చైతన్యను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
ALSO READ :అలేఖ్య రెడ్డి తండ్రి ఎవరు.. అతను ఏం చేస్తాడో తెలుసా?
వీరి వివాహం రాజస్థాన్ లో ఘనంగా జరిగింది. ఇక పెళ్లి తరవాత నిహారిక సినిమాలకు కూడా గుడ్ బై చెప్పేసింది. అయితే నటనకు గుడ్ బై చెప్పింది కానీ నిహారిక ఓటీటీ మరియు యూట్యూబ్ లో చిన్న సినిమాలు మరియు వెబ్ సిరీస్ లకు నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు నిహారిక చైతన్య విడిపోతున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి.
Advertisement
niharika konidela
ఆ వార్తలు రావడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. నిహారిక ఇన్స్టా గ్రామ్ లో చైతన్యను అన్ ఫాలో చేస్తోంది. అదే విధంగా చైతన్య కూడా నిహారికను అన్ ఫాలో చేయడంతో పాటూ వారి పెళ్లి ఫోటోలను సైతం డిలీట్ చేశాడు. ఈ నేపథ్యంలోనే ఇద్దరి విడాకుల వార్తలకు బలం చేకూరింది. అయితే గతంలోనూ వీరిద్దరూ విడిపోతున్నారంటూ జోరుగా ప్రచారం జరిగింది.
చాలా కాలం పాటూ నిహారిక సోషల్ మీడియాకు దూరంగా ఉండటంతో విడాకుల వార్తలు గట్టిగానే వినిపించాయి. కానీ ఆ వార్తలకు పుల్ స్టాప్ పెట్టారు. అయితే ఇప్పుడు మాత్రం నిజంగానే విడిపోతున్నారా అని అనుమానాలు మొదయ్యాయి. దానికి కారణంగా విడిపోయే ముందు సెలబ్రెటీలు అన్ ఫాలో చేసుకోవడం..ఆ తరవాత విడాకులు ప్రకటించడం కామన్ గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. మరి నిహారిక చైతన్య ఈ వార్తలపై ఎలాంటి స్టేట్ మెంట్ ఇస్తారో చూడాలి.
Advertisement
ALSO READ : మాస్ మహరాజ్ రవితేజ భార్య ఎవరో తెలుసా..? మీడియాకు ఎందుకు దూరంగా ఉంటారంటే..!