ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎప్పుడు ఆసక్తిగా ఉంటుంది. దాయాదుల మధ్య పోరు ఎప్పుడు నరాలు నరారు తెగే ఉత్కంఠ మధ్య సాగుతోంది. గత దశాబ్ద కాలంగా పాకిస్తాన్ తో ద్వైపాక్షిక సిరీస్ ఆడటం లేదు ఇండియా. ఐసీసీ మెగా టోర్నీలలోనే తలపడుతోంది. ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్ లో పాకిస్తాన్ మీద అఖండ విజయం సాధించిన భారత్ ఇప్పుడు మరో బిగ్ ఫైట్ కు సిద్ధమైంది. 2024 లో అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా టి20 ప్రపంచకప్ ను నిర్వహిస్తున్నాయి.
ఈ మెగా టోర్నీలో గ్రూప్ స్టేజ్ లో ఇండియా, పాకిస్తాన్ జట్లు పోటీ పడనున్నాయి. ఇప్పుడు ఆ మ్యాచ్ కు వేదిక ఖరారైంది. ఈ భీకర మ్యాచ్ కు న్యూయార్క్ వేదిక కాబోతున్నట్లు సమాచారం. ఈ స్టేడియంలో 30 వేల మంది వరకు అనుమతి ఉంది. ఇక న్యూయార్క్ నగరంలో భారతీయ జనాభా ఎక్కువగా ఉన్నారు. దాంతో ఈ మ్యాచ్ లో టీమిండియాకు ఎక్కువ మద్దతు లభిస్తుంది. ఇక టి20 వరల్డ్ కప్ లో మూడు మ్యాచ్లు అమెరికాలో, తర్వాత ఫైనల్ తో పాటు మిగిలిన మ్యాచ్ లు వెస్టిండీస్ లో జరిగేలా ప్లాన్ చేశారు. టి20 ప్రపంచకప్ ఫైనల్లో కరేబియన్ దీవుల్లో బార్బడోల్స్ లోనే జరిగేలా చూస్తున్నారు.
Advertisement
టీ20 ప్రపంచకప్ లో పాకిస్తాన్ మీద టీం ఇండియాకు మంచి రికార్డు ఉంది. 2007లో జరిగిన టీ20 వరల్డ్ కప్ లో లీగ్ స్టేజ్ లో విజయంతో పాటు ఫైనల్ లో పాకిస్థాన్ ను ఓడించి కప్పు కూడా గెలిచింది. కాబట్టి ఈ మ్యాచ్ న్యూయార్క్ ఫ్యాన్స్ కు సూపర్ మజా ఇస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. త్వరలోనే పూర్తిస్థాయి షెడ్యూల్ ను విడుదల చేసేందుకు ఐసీసీ ప్లాన్ చేస్తుంది. మరి మెగా సమరంలో టీమిండియా పాకిస్తాన్ ను మరోసారి మట్టి కరిపిస్తుందేమో చూడాలి.
Advertisement
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.