Home » ఏపీ విద్యార్థులకు అలర్ట్..ఇంటర్ పరీక్షలకు కొత్త షెడ్యూల్ !

ఏపీ విద్యార్థులకు అలర్ట్..ఇంటర్ పరీక్షలకు కొత్త షెడ్యూల్ !

by Bunty
Ad

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ఇంటర్‌ విద్యార్థులకు బిగ్‌ అలర్ట్‌. ఏపీలో ఇంటర్మీడియట్ విద్యార్థుల ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ మారింది. కొత్త షెడ్యూల్ ను ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. థియరీ పరీక్షల కంటే ముందే ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. వాస్తవానికి ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను ఏప్రిల్ 15 నుంచి మే 10 వరకు రెండు దశల్లో నిర్వహించాల్సి ఉంది.

Advertisement

అయితే ఎంసెట్ వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థుల సౌకర్యార్థం ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ మార్చింది ప్రభుత్వం. ఈ మేరకు వివిధ కళాశాలల యాజమాన్యాల నుంచి ఇంటర్మీడియట్ బోర్డుకు విజ్ఞప్తులు అందాయి. కొత్త షెడ్యూల్ ప్రకారం ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 20 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంటర్ ఒకేషనల్ కోర్సుల ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 20 నుంచి మార్చి 7 వరకు జరగనున్నాయి. ఇంటర్ రెగ్యులర్ విద్యార్థులకు మాత్రం ఫిబ్రవరి 26 నుంచి మార్చి 7 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలు రెండు దశల్లో జరుగుతాయి.

Advertisement

ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, తిరిగి 2 గంటల నుంచి 5 గంటల వరకు జరగనున్నాయి. అదేవిధంగా ఫిబ్రవరి 22న నిర్వహించాల్సిన ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్షను ఫిబ్రవరి 15వ తేదీనే నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 24న జరగాల్సిన ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను ఫిబ్రవరి 17న నిర్వహిస్తారు. థియరీ పరీక్షలు యధావిధిగా మార్చి 15 నుంచి జరగనున్నాయి.

READ ALSO : వైజాగ్‌లో స్థలం కొన్న చిరంజీవి..ఆ స్థలం కోసం పోటీ పడి, అన్ని కోట్లు పోశారా !

Visitors Are Also Reading