Home » తెలంగాణ‌లో నూత‌న సంస్క‌ర‌ణ‌లు.. కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం..!

తెలంగాణ‌లో నూత‌న సంస్క‌ర‌ణ‌లు.. కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం..!

by Anji
Ad

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పాల‌న‌ప‌ర‌మైన కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. తెలంగాణ‌లో వివిధ ప్ర‌భుత్వ శాఖ‌ల‌లో ఉద్యోగుల ప‌నితీరు, ఖాళీల భ‌ర్తీ స‌హా ప్ర‌భుత్వ కార్యక్ర‌మాల అమ‌లులో అన్నిస్థాయిలు ఉద్యోగుల క్రియాశీల భాగ‌స్వామ్యం త‌దిత‌ర అంశాల‌ను అధ్య‌య‌నం చేసి.. సూచ‌న‌లు ఇవ్వ‌డానికి న‌లుగురు ఐఏఎస్ అధికారుల‌తో పరిపాల‌నా సంస్క‌ర‌ణల క‌మిటీ ఏర్పాటు చేసారు. ఉద్యోగుల ప‌నితీరు మెరుగుప‌రిచి ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల అమలులో అన్ని స్థాయిలు వారికీ భాగ‌స్వామ్యం క‌ల్పించ‌డం వంటి అంశాల‌పైనా ఈ క‌మిటీ సూచ‌న‌లు ఇవ్వ‌నున్న‌ది. రాష్ట్రప‌తి ఉత్త‌ర్వులు మేర‌కు కొత్త జోన‌ల్ విధానంలో భాగంగా జిల్లాలు, జోన్లు, బ‌హుళ జోన్ల‌లో ఉద్యోగుల బ‌ద‌లాయింపు ప్ర‌క్రియ పూర్త‌యిన నేప‌థ్యంలో సీఎం ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

Lockdown in Telangana? CM KCR to hold meeting on May 11 | The News Minuteస్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్స్ శాఖ ఐజీ అండ్ క‌మిష‌న‌ర్ శేషాద్రి అధ్య‌క్ష‌త‌న సీఎం సెక్ర‌ట‌రీ స్మితా స‌భ‌ర్వాల్‌, జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ లోకేశ్ కుమార్, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ క‌మిష‌న‌ర్ దివ్య స‌భ్యులుగా క‌మిటీ ఏర్పాటు చేశారు. కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో జ‌రిగిన ఉన్న‌త స్థాయి స‌మీక్ష‌లో ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించారు. రాష్ట్రప‌తి ఉత్త‌ర్వుల ప్ర‌కారం.. 38,643 మంది ఉద్యోగుల‌ను ఉమ్మ‌డి జిల్లాలలో స‌ర్దుబాటు చేయ‌గా.. 101 మంది మిన‌హా 38,542 మంది ఉద్యోగులు ఆయా స్థానాల్లో చేరిపోయార‌ని అధికారులు సీఎంకు వివ‌రించారు.

Advertisement

Advertisement

ప‌లు జిల్లాల‌లో ఏర్ప‌డిన ఖాళీల‌ను వెంట‌నే భ‌ర్తీ చేసే విధంగా నోటిఫికేష‌న్ జారీ చేయ‌డానికి అవ‌స‌రం అయిన చ‌ర్య‌లు తీసుకోవ‌డం, జిల్లాల్లో స‌మీకృత ప్ర‌భుత్వ కార్యాల‌యాల స‌ముదాయాలు, జిల్లా పోలీస్ భ‌వ‌నాల నిర్మాణం పూర్త‌వుతున్న త‌రుణంలో జిల్లాలో వివిధ శాఖ‌ల ప‌నితీరును మెరుగు ప‌ర‌చ‌డానికి తీసుకోవాల్సిన చ‌ర్య‌లు స‌మీక్షించి నివేదిక అందించాల‌ని ముఖ్య‌మంత్రి క‌మిటీకి సూచించారు. ఆర్డీఓ, వీఆర్‌వోలు, వీఆర్ఏల సేవ‌ల‌ను ఎలా ఉప‌యోగించుకోవాలి. కొత్త జిల్లాల‌లో కొత్త‌గా ఏర్ప‌డిన‌టువంటి మండ‌లాల్లో ఏయే శాఖ‌ల‌కు ప‌ని ఒత్తిడి ఉందో అంచ‌నా వేసి దానికి అనుగుణంగా కొత్త‌గా పోస్టుల అవ‌స‌రాన్ని గుర్తించ‌డం, సాంకేతికంగా ఏమి చ‌ర్య‌లు తీసుకోవాలి త‌దిత‌ర అంశాల‌పై ఈ క‌మిటీ అధ్య‌య‌నం చేయాలి అని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

వివిధ సంక్షేమ అభివృద్ధి ప‌థ‌కాల అమ‌లులో తెలంగాణ రాష్ట్రం ఇప్ప‌టికే దేశంలో ప్ర‌థ‌మ‌స్థానంలో నిలిచింద‌ని.. ఇంకా మెరుగైన ప‌రిపాల‌న సంస్క‌ర‌ణ‌లు తీసుకొచ్చి ప్ర‌జ‌ల‌కు అద్భుత‌మైన సేవ‌ల‌ను అందించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింద‌ని సీఎం కేసీఆర్ స్ప‌స్టం చేసారు. ప్ర‌జ‌ల‌కు నిత్యం ఎక్కువ‌గా అందుబాటులో ఉండాల్సిన విద్య‌, వైద్యం, మున్సిప‌ల్, పంచాయ‌తీ రాజ్ శాఖ‌ల ద్వారా ఇంకా మెరుగైన సేవ‌లు, మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న విష‌యంలో ఉద్యోగుల సేవ‌ల‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నే అంశంలో త‌గు సూచ‌న‌లు చేయాల‌ని సీఎం కేసీఆర్ క‌మిటీకి సూచించారు.

Visitors Are Also Reading