Telugu News » Blog » ద‌స‌రా నుంచి కొత్త పోస్ట‌ర్ విడుద‌ల.. మాస్ లుక్ లో నాని అదుర్స్‌..!

ద‌స‌రా నుంచి కొత్త పోస్ట‌ర్ విడుద‌ల.. మాస్ లుక్ లో నాని అదుర్స్‌..!

by Anji
Ads

నేచుర‌ల్ స్టార్ హీరో నాని ఇటీవ‌ల న‌టించిన అంటే సుంద‌రానికి అనే సినిమా కాస్త నిరాశ ప‌రిచింది. దీంతో ఈసారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు నాని. ప్ర‌స్తుతం ఆయన చేసిన సినిమానే ‘దసరా’. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకి శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వం వహించాడు. నాని సరసన క‌థానాయికగా కీర్తి సురేష్ న‌టించ‌నుంది. ఆయన కాంబినేషన్ లో ఆమెకి ఇది రెండో సినిమా. ఈ సినిమాలో నాని ప‌క్కా మాస్ లుక్ తో కనిపించనున్నాడు. రామగుండం బొగ్గు గనుల నేపథ్యంలో ఈ కథ కొన‌సాగ‌నుంది.

Advertisement

ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యాన‌ర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్, సత్యన్ సూర్యన్ మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే, ఈ సినిమా పేరు ‘దసరా’ కావడంతో, ‘దసరా’ పండుగకి ఏదైనా అప్ డేట్ వదులుతారా? అని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా దసరా సినిమాలోని ఫస్ట్ సింగిల్ ధూమ్ ధామ్ దోస్తాన్ ను అక్టోబర్ 3న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

Advertisement

Also Read :  ఆర్ఆర్ఆర్ ఆస్కార్ నామినేష‌న్ పై ర‌ష్మిక ఇలా ఎందుకు అన్న‌ది..?


ఇందులో భాగంగానే నాని కొత్త పోస్టర్ ను విడుద‌ల‌ చేశారు. ఇందులో ఫుల్ మాస్ అవతారంలో నాని కనిపిస్తున్నాడు. లుంగీ ధరించి, దుమ్ముతో నిండిపోయి అతడు కనిపించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. కోల్ మైన్స్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ పాటలో నాని డ్యాన్సులు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తాయని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. కాగా, ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 30వ తేదీన విడుదల చేయనున్నారు.

Advertisement

Also Read :  పంచ్‌ ప్రసాద్‌ నెలకు ఎంత సంపాదిస్తాడో తెలిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే !