Home » New Home;కొత్త ఇల్లు కట్టుకుంటున్నారా.. దేనికి ఎంత ఖర్చు అంటే..!

New Home;కొత్త ఇల్లు కట్టుకుంటున్నారా.. దేనికి ఎంత ఖర్చు అంటే..!

Ad

జీవితంలో ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు పెద్దలు. ఇల్లు కట్టుకున్న పెళ్లి చేసుకున్న 100 సంవత్సరాలు ఉండాలి అంటారు. కాబట్టి ప్రతి ఒక్కరి వారి జీవన గమనంలో మంచి ఇల్లు నిర్మించుకోవాలని భావిస్తారు. ధనవంతులకైతే ఇవన్నీ సాధ్యమవుతాయి కానీ మధ్యతరగతి వారికి ఇల్లు కట్టుకోవడం చాలా ఇబ్బందితో కూడిన పని. ఎంతో కష్టపడి ప్రేమగా ఇల్లు కట్టుకుంటారు. పైసా పైసా కూడేసుకుని వారికి నచ్చిన కలల స్వగృహాన్ని నిర్మించుకుంటారు. ప్రస్తుత కాలంలో భూముల రేట్లు పెరిగిపోయాయి.

also read:ఒక్క స్టెప్పు, ఫైట్ లేకుండా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బాలయ్య సినిమా… ఏంటంటే…?

Advertisement

ప్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలంటే లక్షల రూపాయల ఖర్చు అవుతున్నాయి. ఈ తరుణంలో హైదరాబాదులో ఇల్లు కట్టాలంటే మనకు ఎంత ఖర్చవుతుంది.. ముఖ్యంగా 144 గజాల్లో ఇల్లు కట్టాలి అంటే మనకు పూర్తిగా అయ్యే ఖర్చు ఎంతో ఇప్పుడు చూద్దాం.. ఇల్లు అనేది మూడు గ్రేడ్ల రూపంలో ఉంటుంది. ఒకటి బేసిక్, రెండవది మీడియం, మూడవది ప్రీమియం. చాలామంది మధ్యతరగతి వారు బేసిక్ గ్రేడ్ లోనే ఇల్లు కడతారు. బేసిక్ గ్రేడ్ లో అయితే 15 లక్షలు, మీడియం గ్రేడ్ లో అయితే 19 లక్షలు, ప్రీమియం గ్రేడ్ లో అయితే 23 లక్షల ఖర్చు అవుతుంది. మరి ఇల్లు కట్టుకునే ముందు ఏ నిర్మాణం ఎంత శాతం ఉంటుందో ఇప్పుడు చూద్దాం..

హోమ్ డిజైన్, అప్రూవల్: 2.5%

రూఫ్ స్లాబ్: 13%

నీటి సరఫరా, ప్లంబింగ్ పని: 5%

Advertisement

ఫుటింగ్ మరియు ఫౌండేషన్: 12%

ఇటుకల పని, ప్లాస్టరింగ్: 17%

ఆర్సీసీ వర్క్, స్తంభాలు, కాలమ్స్, స్లాబ్స్: 10%

ఫ్లోరింగ్ అండ్ టైలింగ్: 10%

ఎక్స్కవేషన్ (తవ్వకాలు): 3%

ఎలక్ట్రిక్ వైరింగ్: 8%

తలుపులు, కిటికీలు: 8%

also read:“వయసు”తో సంబంధం లేకుండా పెళ్లి చేసుకున్న టీమిండియా క్రికెటర్స్…!

బేసిక్ గ్రేడ్ లో కట్టుకోవాలనుకుంటే:

మెటీరియల్ ధరలు: రూ. 15,17,938.

సిమెంట్: రూ. 2,07,036/- 583 బ్యాగులు.

స్టీల్: రూ. 1,90,512/- 4536 కిలోలు

కాంక్రీట్: రూ. 66,484/- 2,462 క్యూబిక్ ఫీట్లకు.

ఇటుకలు: రూ. 1,47,744.

తలుపులు: రూ. 66,951/- 233 చదరపు అడుగులకు

ఇసుక: రూ. 98,496/- (2592 క్యూబిక్ ఫీట్లకు

ఫ్లోరింగ్: రూ. 86,832/- 1296 చదరపు అడుగులకు.

కిటికీలు: రూ. 48,911/- (220 చదరపు అడుగులకు.

కిచెన్ వర్క్: రూ. 43,480/- 71 చదరపు అడుగులకు.

ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్: రూ. 10,692/- 194 చదరపు అడుగులకు.

శానిటరీ ఫైటింగ్స్: రూ. 90,720/- 1296 చదరపు అడుగులకు

కాంట్రాక్టర్(ఆర్సీసీ, బ్రిక్ వర్క్, ప్లాస్టరింగ్): రూ. 3,04,560/- 1296 చదరపు అడుగులకు.

పెయింటింగ్: రూ. 1,55,520/- 7,776 చదరపు అడుగులకు.

also read:Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి

Visitors Are Also Reading