Telugu News » Video Viral : పెళ్లి అయిన వెంట‌నే శ‌రీరాల‌కు నిప్పంటించుకున్న నూత‌న జంట‌..!

Video Viral : పెళ్లి అయిన వెంట‌నే శ‌రీరాల‌కు నిప్పంటించుకున్న నూత‌న జంట‌..!

by Anji

జీవితంలో పెళ్లికి ఎంతో ప్రాముఖ్య‌త ఉంది. నేటిత‌రం ఈ వేడుక‌ను క‌ల‌కాలం గుర్తుండిపోయే విదంగా జ‌రుపుకోవాల‌నుకుంటున్నారు. అమెరికాకు చెందిన ఓ జంట త‌మ పెళ్లి రిసెప్ష‌న్ పూర్త‌యిన త‌రువాత త‌మ‌కు తాము నిప్పంటించుకున్నారు. వారిని మంటలు చుట్టుముడుతున్నా లెక్క చేయ‌కుండా న‌వ్వుతూ న‌డుచుకుంటూ వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ఈ జంట ఎవ‌రు..?త‌మ‌కు తాము నిప్పు ఎందుకు అంటించుకోవాల్సి వ‌చ్చింది..? వారి ప‌రిస్థితి ఏంట‌నే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం కావాలంటే ఈ క‌థ‌నం చ‌ద‌వాల్సిందే..!

Ads

గేబ్ జెస్సప్‌, యాంబిర్ బాంబిర్ ఇద్ద‌రూ హాలీవుడ్‌లో స్టంట్ డ‌బుల్స్ గా చేస్తుంటారు. హీరో హీరోయిన్ల‌కు బ‌దులుగా ఎన్నో ప్ర‌మాద‌క‌ర‌మైన స్టంట్స్ చేసిన అనుభ‌వం వారిది. ఇటీవ‌లే వారి పెళ్లి వైభ‌వంగా చోటుచేసుకుంది. త‌మ పెళ్లి జీవితాంతం గుర్తుండిపోయేవిధంగా జ‌రుపుకోవాల‌ని ఆ ఇద్ద‌రూ అనుకున్నారు. ఇక స్టంట్ మాస్ట‌ర్లుగా త‌మ అనుభ‌వం ఉన్నంత ఉప‌యోగించి ఓ ప‌క్కాగా ప్లాన్ రెడీ చేసుకున్నారు. పెళ్లి రిసెప్ష‌న్ పూర్తి అయిన త‌రువాత త‌మ ప‌థ‌కాన్ని అమ‌లు చేసారు. అక్క‌డి వివాహ సంప్రదాయం ప్ర‌కారం.. రిసెప్ష‌న్ త‌రువాత వ‌ధూవ‌రులు ఒక‌రిచేతిలో మ‌రొక‌రు చేయి వేసుకుని వేదిక విడిచి వెళ్లిపోవాలి. ఈ త‌రుణంలోనే ఆ జంట స్టంట్‌కు తెర‌లేపింది. ప్లాన్ ప్ర‌కారం.. మ‌రొక వ్య‌క్తి సాయంతో వారు నిప్పు అంటించుకున్నారు. చూస్తుండ‌గానే వాళ్ల ఒళ్లంతా మంట‌లు వ్యాపించాయి. ఇవి ఏమి లెక్క‌చేయ‌కుండా వారు ఒక‌రిచేతిలో మ‌రొక‌రు చేయి వేసి స‌ర‌దాగా న‌వ్వుకుంటూ రిసెప్ష‌న్ వేదిక‌ను వీడారు.


కొద్ది దూరం వెళ్లిన త‌రువాత అక్క‌డ ఉన్న మ‌రికొంద‌రూ వారి మంట‌ల‌ను ఆర్పివేశారు. ఈ వెరైటీ వెడ్డింగ్ ఎగ్జిట్ ప్ర‌స్తుతం నెటిజ‌న్ల‌ను చాలా ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఆ జంట‌కు ఏమైందో అని కొంద‌రూ కంగారు ప‌డిన‌ప్ప‌టికీ అస‌లు విష‌యం తెలిసి ఆశ్చ‌ర్య‌పోయారు. ఇద్ద‌రూ స్టంట్ మాస్ట‌ర్లు అవ్వ‌డంతో ఇలా చేశార‌ని తెలిసి అవాక్క‌య్యారు. అయితే వ‌ధువు జుట్టు మంట‌ల్లో కాలిపోయింద‌ని కొంద‌రూ సందేహం వ్య‌క్తం చేసారు. ఆమె విగ్ పెట్టుకుంద‌ని జంట క్లారిటీ ఇచ్చింది. అంతే కాదు.. జుట్టుకు కాలిపోకుండా ఓ ర‌క‌మైన జ‌ల్ కూడా రాసుకున్నామ‌ని వారు చెప్పుకొచ్చారు. వారి స్టంట్‌కు సంబంధించిన ఈ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట్లో విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.

Also Read : 

క‌రోనాతో కొడుకు మృతి.. కోడలుకు మ‌రో పెళ్లి చేసిన అత్త‌, మామ‌..!

స‌మంత మాదిరిగానే న‌య‌న‌తార కూడా విడాకుల‌తో విడిపోతుంద‌ట‌.. అందుకోస‌మేనా..?


You may also like