ఆరోగ్యశ్రీ సేవలు ఏపీలో నిలిపి వేస్తున్నామంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ రోగులుకు అందించిన చికిత్సలకి తగ్గట్టుగా ఫీజులు చెల్లింపుల్లో ఆలస్యం అలానే ప్యాకేజీ ధరలని పెంచకపోవడం నిరసిస్తూ, ఈనెల 29 నుండి ఆరోగ్యశ్రీ ట్రస్టు కింద కొత్త కేసులని చూసేది లేదని, అసోసియేషన్ చెప్పింది. న్యాయపరమైన తమ డిమాండ్లను ఆమోదించే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వంలో కనపడకపోవడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పారు. ఉద్యోగుల ఈహెచ్ఎస్ కింద వైద్య సేవలను అందించలేమన్నారు ఈ సంవత్సరం జూన్ నవంబర్ నెలలో వాళ్ళ డిమాండ్లను పరిష్కారం కోసం సేవలు నిలిపివేస్తామని అసోసియేషన్ చెప్పింది.
Advertisement
తర్వాత చర్యలు జరిపి ఈ సమస్యలను పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందిట. ఈ మేరకు రోగులకి ప్రైవేట్ ఆసుపత్రులు యధావిధిగా సేవలు కొనసాగించాయి. అయితే గత నెలలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం నుండి సానుకూల చర్యలు లేకపోవడం వలన ఈ నెల 29 నుండి వైద్య సేవలు నిలిపివేయాలని నిర్ణయించుకున్నారట. ప్రభుత్వానికి లేఖ ని కూడా అందించారు ప్రభుత్వం. ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రి కి 1000 కోట్లు వరకు చెల్లించాల్సి ఉందట.
Advertisement
ప్రభుత్వంతో నవంబర్లో జరిగిన చర్యల సందర్భంగా డిసెంబర్ నెలలోగా పూర్తిస్థాయిలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. కానీ పూర్తి కాలేదు. 2013 నుండి చికిత్సల ప్యాకేజీ ధరలను పెంపు కోసం అసోసియేషన్ తరపున పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా కూడా ఫలితం లేదుట. తాజాగా కుటుంబ వార్షిక చికిత్స లిమిట్ ని ప్రస్తుతం ఐదు లక్షలు ఉంటే దానిని 25 లక్షల కి పెంచారు. ఇలా పెంచడం వలన ఆసుపత్రుల పై ఆర్థిక భారం పెరిగింది ఆరోగ్య శ్రీ వైద్య సేవలను నిలిపివేయాలని గత నెలలోనే నెట్వర్క్ ఆసుపత్రిలు నిర్ణయించుకున్నాయి. సమస్య పరిష్కారమయ్యే వరకు కూడా నిరసన కొనసాగించాలని నిర్ణయించాయట.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!