Home » యాని మాస్ట‌ర్ కు క‌రోనా…నీకు త‌గిన శాస్తి జ‌రిగిందంటూ నెటిజ‌న్ల ట్రోల్స్..!

యాని మాస్ట‌ర్ కు క‌రోనా…నీకు త‌గిన శాస్తి జ‌రిగిందంటూ నెటిజ‌న్ల ట్రోల్స్..!

by AJAY
Ad

తెలుగులోనే అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్…. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన కొంతమంది ప్రాణస్నేహితులు గా బ‌య‌ట‌కు వెళితే మరి కొంత మంది మాత్రం శత్రువులుగా బ‌య‌ట‌కు వెళ‌తారు. ఇక బిగ్ బాస్ లోని సభ్యులు గొడవపడితే బయట ఉన్న వారి అభిమానులు కూడా తమ అభిమాన కంటెస్టెంట్ తో గొడవ పడ్డ వారిపై కోపాన్ని పెంచుకుంటారు. సోషల్ మీడియాలో విమర్శలు కురిపిస్తారు. రీసెంట్ గా బిగ్ బాస్ సీజన్ 5 లోనూ అదే జరిగింది.

ANI MASTER

Advertisement

యాంకర్ రవి, యానీ మాస్టర్ తమపై ట్రోల్స్ వ‌స్తున్నాయ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. యాంకర్ రవి అయితే ఏకంగా పోలీసులను ఆశ్రయించారు. ఇదిలా ఉంటే తాజాగా యానీ మాస్టర్ కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. గతంలోనూ తనకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయాన్ని తెలుపుతూ యాని మాస్టర్ సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. గత సంవత్సరం కూడా తనకు కరోనా పాజిటివ్ వచ్చింద‌ని తెలిపింది.

Advertisement

ANI MASTER

ANI MASTER

24 రోజుల తర్వాత జనవరి 23న కరోనా తగ్గిపోయిందని…. కానీ మళ్ళీ ఇప్పుడు జనవరి 24న కరోనా పాజిటివ్ వచ్చింద‌ని తెలిపింది. క‌రోనా ఏమైనా టైం మెయింటైన్ చేస్తుందా చిరాకుగా బోరింగ్ గా ఉంది అంటూ యాని మాస్టర్ త‌న పోస్ట్ లో పేర్కొంది. దాంతో యాని మాస్ట‌ర్ అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

అయితే ఓ నెటిజ‌న్ మాత్రం నీకు తగిన శాస్తి జ‌రిగిందంటూ విమర్శలు కురిపించింది. నువ్వు స‌న్నీకి సపోర్ట్ చేయలేదు కదా నీకు క‌రోనా రావాల్సిందే అంటూ కోపాన్ని చూపించింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ లను యాని మాస్ట‌ర్ షేర్ చేసింది. నువ్వు ఇంకా ఎదగాలి అంటూ ఆ నెటిజ‌న్ కు యాని మాస్ట‌ర్ కౌంటర్ ఇచ్చింది. అంతేకాకుండా సన్నీ బాబా నాకు కరోనా తగ్గిపోయేలా ఏమైనా చేయొచ్చు కదా అంటూ మరో కౌంటర్ వేసింది.

Visitors Are Also Reading