Home » రష్మిక పై నెటిజన్స్ ట్రోలింగ్.. అందుకోసమేనా ?

రష్మిక పై నెటిజన్స్ ట్రోలింగ్.. అందుకోసమేనా ?

by Anji
Ad

సాధారాణంగా సెలబ్రెటీలందరూ మనం అనుకున్నంత సంతోషంగా, హ్యాపీగా మాత్రం ఉండరు. లైఫ్ లో సెలబ్రెటీల కంటే సాధారణ ప్రజలే సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే.. సెలబ్రెటీలు ఎక్కడికి వెళ్లాలన్నా సెక్యూరిటీ తప్పనిసరి అవసరం. వారు నచ్చినది తినాలన్నా కానీ వారు కొన్ని సందర్బాల్లో నచ్చిన ఫుడ్ ని తినలేరు.  బయట ఎక్కువగా తిరగలేరు. వారికి అంతగా ప్రైవసీ ఉండదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.

Advertisement

సెలబ్రీటీలు అందంగా  కనిపించినప్పుడు తారలపై పొగడ్తలు కురిపించేవాళ్లు వారి వేషధారణ నచ్చకపోతే నిర్మొహమాటంగా విమర్శలు కూడా గుప్పిస్తుంటారు. తాజాగా ఇలాంటి పరిస్థితి నేషనల్ క్రష్ రష్మిక మందన్నాకు ఎదురైంది. ఓ అవార్డుల ఫంక్షన్ కు రష్మిక బ్లాక్ డ్రెస్ లో హాజరైంది.కొందరు ఆమె అవుట్ ఫిట్ చూసి ఆహా అంటున్నా మరికొందరు మాత్రం ఏడ్చినట్లుంది అని కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Also Read :  సుమన్ జీవితాన్ని నాశనం చేయాలనుకున్న స్నేహితుడు ఎవరో తెలుసా ?

‘ఏంటి? రష్మిక ఉర్పీని ఫాలో అవుతోంది. తను ఇలా చేస్తుందని అసలు ఊహించలేదు, అసలు ఈ సెలబ్రిటీలకు ఏమౌతుంది? వీళ్ళందరినీ బాయ్ కాట్ చేసేయాలి. ఆల్ రెడీ ఫేమస్ అయిన వాళ్లు కూడా ఎక్స్ ఫోజ్ చేయాల్సిన అవసరం ఏముంది?’ అని కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి రష్మిక వీడియో మాత్రం సోషల్ మీడియాలో  వైరల్ గా మారింది.

Also Read :   రెండో పెళ్లి గురించి మనోజ్ ఏమన్నాడో తెలుసా ?

Visitors Are Also Reading