Home » విగ్నేష్, నయనతారల తొందరపాటు.. గట్టి షాక్ ఇచ్చిన నెట్‌ఫ్లిక్స్…!

విగ్నేష్, నయనతారల తొందరపాటు.. గట్టి షాక్ ఇచ్చిన నెట్‌ఫ్లిక్స్…!

by Azhar
Ad

సినీ ఇండస్ట్రీకి చెందిన వారు ఎవరైనా పెళ్లి చేసుకుంటున్నారు అంటే దానికి ఉంటె క్రేజ్ వేరు. అదే ఇండస్ట్రీ చెందిన ఇద్దరు జంటగా మారుతున్నారు అంటే ఆ పెళ్లి పెద్ద చర్చ అనే చెప్పాలి. అయితే ఈ మధ్యే దర్శకుడు విగ్నేష్, నయనతార పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. దాదాపు ఏడు సంవత్సరాలు ప్రేమాయణం నడిపిన తర్వాత వీరు ఈ మధ్యే పెళ్లి చేసుకున్నారు. అందువల్ల ఈ పెళ్ళికి ఎక్కడ లేని బజ్ అనేది ఏర్పడింది. ఇక ఆ బజ్ నే క్యాష్ చేసుకోవాలని చూసింది ఈ జంట. దాంతో విగ్నేష్, నయనతార తమ పెళ్లి యొక్క ఓటీటీ రైట్స్ అనేవి నెట్‌ఫ్లిక్స్ కు అమ్మింది.

Advertisement

అయితే అనుకున్న విధంగానే ఎంతో అట్టహాసంగా జరిగిన విగ్నేష్, నయనతారల పెళ్లికి అన్ని సినిమా ఇండస్ట్రీల నుండి సెలబ్రెటీలు వచ్చారు. బాలీవుడ్ నుండి కూడా కింగ్ కాంగ్ షారుక్ ఖాన్ ఈ పెళ్లికి వచ్చాడు. దాంతో అభిమానులు ఈ పెళ్లి వీడియో చూడటానికి చాలా ఆతృతగా ఉన్నారు. ఈ తరుణంలో నెట్‌ఫ్లిక్స్ సంస్థ అభిమానులకు అలాగే విగ్నేష్, నయనతారల గట్టి షాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అదేంటంటే.. ఈ పెళ్లి యొక్క ఓటీటీ రైట్స్ కు కుదుర్చుకున్న ఒప్పందాన్ని నెట్‌ఫ్లిక్స్ రద్దు చేసినట్లు తెలుస్తుంది.

Advertisement

అయితే నెట్‌ఫ్లిక్స్ ఇలా చేయడానికి విగ్నేష్, నయనతారల తొందరపాటు తనం కారణం అని తెలుస్తుంది. ఏమైందంటే.. విగ్నేష్, నయనతారల పెళ్లి జరిగి నెల రోజులు కూడా కాకముందే… వీరి పెళ్లికి సంబంధించిన ముఖ్యమైన ఫోటోలను ఈ జంట సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ కారణంగానే నెట్‌ఫ్లిక్స్ తమ ఒప్పందం రద్దు చేసుకుంది అని సమాచారం. ఇలా తమను సంపాదించకుండా.. విగ్నేష్, నయనతారలు ఆ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం నెట్‌ఫ్లిక్స్ సంస్థకు ఆగ్రహం తెప్పించింది. దాంతో ఈ పెళ్లి కోసం 25 కోట్లతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని నెట్‌ఫ్లిక్స్ క్యాన్సిల్ చేసింది.’

ఇవి కూడా చదవండి :

దక్షిణాఫ్రికా లీగ్ లో కూడా మన ఐపీఎల్ జట్లే హావ…!

నేనుంటే టీం ఇండియా అన్ని వరల్డ్ కప్స్ గెలిచేది అంటున్న శ్రీశాంత్…!

Visitors Are Also Reading