Home » నయనతార పెళ్లి టీజర్ వచ్చేసింది..!

నయనతార పెళ్లి టీజర్ వచ్చేసింది..!

by Azhar
Ad

సినిమాల్లో ఎప్పటి నుండో హీరోయిన్ గా కొనసాగుతున్న నయనతార ఈ మధ్యే దర్శకుడు విగ్నేష్ ను పెళ్లి చేసుకుంది. అయితే నయనతార, విగ్నేష్ ఎప్పటి నుండో ప్రేమలో ఉన్నారు అనే విషయం అందరికి తెలుసు. ఇక ఆ ప్రేమ ప్రయాణానికి పులిస్టాప్ పెట్టి పెళ్లి ప్రయాణం వీరు ఈ మధ్యే ప్రారంభించారు. అయితే వీరి పెళ్లికి సంబంధించిన ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్ ఫ్లిక్స్ కొన్నుకుంది.

Advertisement

అయితే 25 కోట్ల భారీ ధరకు కుదిరిన ఈ డీల్ అనేది క్యాన్సిల్ అయ్యింది అని గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఎందుకంటే.. నయనతార, విగ్నేష్ తమ పెళ్లికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఫొటోస్ అలాగే పెద్ద సెలబ్రెటీలతో దిగ్గిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ జంటపై ఆగ్రహం వ్యక్తం చేసింది అని.. ఇక ఈ కారణంతోనే తమ ఒప్పందం కూడా రద్దు చేసుకుంది అని అన్నారు.

Advertisement

కానీ ఇప్పుడు ఆ వార్తలను అన్నింటిని అబ్బదం చేస్తూ నెట్ ఫ్లిక్స్ సంస్థ నయనతార, విగ్నేష్ పెళ్లి యొక్క టీజర్ అనేది విడుదల చేసింది. గతంలోనే వీరి పెళ్లికి సంబంధించిన ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా నెట్ ఫ్లిక్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు విడుదల చేసిన ఈ టీజర్ లో నయనతార అలాగే విగ్నేష్ తమకు ఒక్కరి మీద ఒక్కరికి ఉన్న ప్రేమ గురించి తెలుపుతూ కనిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

తప్పు చేసి సమర్ధించుకుంటున్న ఆస్ట్రేలియా..!

మళ్ళీ సర్జరీ చేసుకున్న అక్తర్.. ఎన్నోసారి అంటే…?

Visitors Are Also Reading