జీతూ జోసెఫ్ అంటే అసలు ఎవరికీ తెలియదు కానీ దృశ్యం డైరెక్టర్ అంటే అందరికీ అర్థమవుతుంది. ఈ డైరెక్టర్ దృశ్యం, దృశ్యం టు వంటి మూవీస్ ని డైరెక్ట్ చేశారు. తాజాగా మలయాళం మెగాస్టార్ మోహన్ లాల్ తో కోర్టు డ్రామా నేరు అనే సినిమాని తీసుకువచ్చారు ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 21న మలయాళం లో రిలీజ్ అయింది. బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఈ మూవీలో మోహన్ లాల్, ప్రియమణి తదితరులు నటించారు మలయాళ ప్రేక్షకులకి ఈ సినిమా బాగా నచ్చింది.
Advertisement
Advertisement
ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 80 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లను రాబట్టింది అయితే ఇప్పుడు ఓటీటీ హక్కుల్ని కొనుగోలు చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ భారీ ధరకు ఈ సినిమాను దక్కించుకుంది. జనవరి 23న ఈ సినిమా ఓటీటీలోకి అందుబాటులో రాబోతోంది. తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతోంది, తెలుగు ప్రేక్షకులు మాత్రం నిరాశ మిగిలింది. నేరు చిత్రాన్ని వెంకటేష్ రీమేక్ చేద్దామని అనుకుంటున్నారట అందుకే తెలుగులో రిలీజ్ చేయట్లేదు.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!