Home » Nenu Student Sir Trailer : నేను స్టూడెంట్ సార్ ట్రైలర్ విడుదల

Nenu Student Sir Trailer : నేను స్టూడెంట్ సార్ ట్రైలర్ విడుదల

by Bunty
Ad

బెల్లంకొండ గణేష్… గురించి తెలియని వారు ఉండరు. బెల్లంకొండ ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ కు పరిచయమయ్యాడు బెల్లంకొండ గణేష్. అయితే… బెల్లంకొండ గణేష్… స్వాతిముత్యం సినిమాతో తెలుగు తెరకు అరంగేట్రం చేసిన ఈ హీరో డీసెంట్ హిట్ అందుకున్నాడు. అన్న బెల్లంకొండ శ్రీనివాస్ మాదిరిగా యాక్షన్ సినిమాల జోలికి పోకుండా కంటెంట్ బేస్డ్ చిత్రాలకే ఓటేస్తున్నాడు.

Advertisement

స్వాతిముత్యం మూవీ కంటెంట్ పరంగా ఎంత వైవిధ్యంగా ఉంటుందో అందులో అతడి నటన కూడా అంతే బాగుంటుంది. ప్రస్తుతం అతడు నటించిన రెండో చిత్రం నేను స్టూడెంట్ సార్. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. రాఖీ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది.

Advertisement

సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నాంది ఫేమ్ సతీష్ వర్మ నిర్మించాడు. గణేష్ కు జోడిగా అవంతిక హీరోయిన్ గా నటిస్తుంది. సముద్రఖని కీలకపాత్రలో నటించిన ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ బాణీలు సమకూర్చాడు. ఇక ఈ సినిమా జూన్ 2న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, టీజర్లు సినిమాపై మంచి హైపే క్రియేట్ చేశాయి. కాగా, మేకర్స్ తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

సమంత లాగే బరితెగించిన రష్మిక?

వైసిపి నేతలకే దిమ్మ తిరిగే పని చేసిన జనసేన ఎమ్మెల్యే

Virupaksha : నల్ల కోడి ఎత్తుకుపోయేది క్షుద్ర పూజలకేనని ముందే హింట్ ఇచ్చిన దర్శకుడు

Visitors Are Also Reading