Home » Unstoppable Pawan Kalyan: అన్‏స్టాపబుల్ గ్లింప్స్ వచ్చేసింది.. పవన్ ను ఓ ఆట అడుకున్న బాలయ్య !

Unstoppable Pawan Kalyan: అన్‏స్టాపబుల్ గ్లింప్స్ వచ్చేసింది.. పవన్ ను ఓ ఆట అడుకున్న బాలయ్య !

by Bunty
Ad

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ అనే టాక్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ టాక్ షో సీజన్ 2 కొనసాగుతుంది. అప్పటికే సీజన్ 2 లో భాగంగా నారా చంద్రబాబు నాయుడు, లోకేష్, సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్సేన్, శర్వానంద్, అడవి శేషులు విచ్చేశారు. ఇక తాజాగా పవన్ కూడా ఈ షోకు వచ్చారు.

 

అయితే బాలయ్య అన్ స్టాపబుల్ షో కి ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ విచ్చేసిన ఎపిసోడ్ కి సంబంధించి టీజర్ ఇవాళ రిలీజ్ అయింది. ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన టీజర్ ని బట్టి చూస్తుంటే పవన్ కళ్యాణ్ విషయంలోనూ బాలయ్య అదే ఫార్ములాని ఫాలో అయినట్టు తెలుస్తోంది. రాజకీయ, వ్యక్తిగత ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. తోలుతా అన్నయ్య చిరంజీవి నుంచి నేర్చుకున్నదేంటి, వద్దనుకున్నవేంటి అనే ప్రశ్నవేసి పవన్ ని ఇరుకున పడేశారు.

Advertisement

Advertisement

అనంతరం ఏపీలో భారీ అభిమానగణం ఉన్నప్పటికీ అది ఓట్లుగా ఎందుకు కన్వర్ట్ అవ్వట్లేదంటూ మరో ఫిట్టింగ్ పెట్టేశారు. చూస్తుంటే ఈ షోలో ఇలాంటి ఆసక్తికరమైన ప్రశ్నల్ని బాలయ్య బాగానే సంధించినట్టు అర్థం అవుతోంది. ఇంతే కాదండోయ్, బాలయ్య మార్క్ కామెడీ, దానికి ధీటుగా పవన్ కామిక్ టైమింగ్స్ కూడా అదిరాయి. ఈ మధ్య విమర్శల్లో వాడీవేడి పెరిగిందని బాలయ్య పేర్కొనగా, లేదు. తాను చాలా పద్ధతిగానే మాట్లాడుతానని పవన్ ఇచ్చిన బదులుని బట్టి, ఈ ఎపిసోడ్ లో ఎంటర్టైన్మెంట్ కి కూడా డోకా ఉండదని స్పష్టం అవుతోంది.

read also : పవన్ కళ్యాణ్ 3వ భార్య ఆస్తులు విలువ తెలుసా? ఎంతో తెలిస్తే దిమ్మతిరగాల్సిందే !

Visitors Are Also Reading